మోడీ, జిన్‌పింగ్ సమావేశం ఫలవంతం, భారత్‌తో బలమైన బంధం ఆశిస్తున్నాం: జిన్‌పింగ్
భారత్‌తో సరైన మార్గంలో బలమైన బంధాన్ని చైనా ఆశిస్తోందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వ్యాఖ్యానించినట్లు ఆ దేశ అధికారిక మీడియా జున్హువా తెలియజేసింది.
బీజింగ్: భారత్‌తో సరైన మార్గంలో బలమైన బంధాన్ని చైనా ఆశిస్తోందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వ్యాఖ్యానించినట్లు ఆ దేశ అధికారిక మీడియా జున్హువా తెలియజేసింది.
జియోమిన్ వేదికగా జరిగిన బ్రిక్స్ తొమ్మిదో శిఖరాగ్ర సమావేశానికి హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడితో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాట్లాడుతూ... భారత్‌తో తాము బలమైన సంబంధాలు కోరుకుంటున్నట్లు మోడీకి తెలిపారు.
పంచశీల ఒప్పందం లేదా దానికి అనుబంధంగా ఉన్న అయిదు సూత్రాల ప్రకారం భారత్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రధాని నరేంద్ర మోడీకి కూడా జిన్‌పింగ్ తెలిపినట్లు సమాచారం.

సుమారు మూడు మాసాలపాటు ఇరు దేశాల నడుమ కొనసాగిన డోక్లామ్ ప్రతిష్టంభనకు తెరపడిన తర్వాత మోడీ, జిన్‌పింగ్ మధ్య జరిగిన తొలి ద్వైపాక్షిక సమావేశం ఫలవంతమైనట్లు చైనా మీడియా కూడా పేర్కొంది.
అలాగే ఇరు దేశాల మధ్య ఆరోగ్యకరమైన ద్వైపాక్షిక సంబంధాలు ఆశిస్తున్నట్లు కూడా జిన్‌పింగ్ పేర్కొన్నారు. పొరుగు దేశాలైన భారత్, చైనాలు ప్రపంచంలోనే అతి పెద్ద, అభివృద్ధి చెందుతున్న దేశాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా 1954లో భారత్, చైనాల మధ్య కుదిరిన పంచశీల ఒప్పందాన్ని గుర్తుచేసుకున్నారు.
దీని ప్రకారం రాజ్యాల ప్రాదేశిక సమగ్రత, సారభౌమత్వం పట్ల పరస్పర అవగాహన, దురాక్రమణకు పాల్పడకపోవడం, ఇతర దేశాల అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం, సమానత్వం, ఉమ్మడి ప్రయోజనాలు, శాంతియుత సహజీవనం అనేవి ప్రధానమైనవి.
అంతర్జాతీయ సంబంధాల్లో ప్రంపంచానికి భారతదేశం అందించిన అమూల్యమైన కానుకగా పంచశీలను భావిస్తారు. ఈ ఒప్పందాన్ని 1954 మే 29 న భారత్, చైనా, మాయన్మార్ మధ్య శాంతి, సుహృద్భావం కోసం చేసుకున్నాయి.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications