ఇరాన్ వార్ లోకి చైనా ? ఇజ్రాయెల్ కు సీరియస్ వార్నింగ్..!
ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించి రెండు వారాలవుతోంది. ఇప్పటికీ ఫలితం మాత్రం కనిపించడం లేదు. దీనికి తోడు ఇరాన్ చేస్తున్న ప్రతీకార దాడులతో గల్ఫ్ దేశాలతో పాటు వాటిలో ఉన్న అమెరికా బేస్ లకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ నష్టం పెరుగుతూ పోతున్నా అమెరికా-ఇజ్రాయెల్ ఏమీ చేయలేక చేష్టలుడిగి చూడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఖమేనీ వారసుడిగా ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్ గా బాధ్యతలు చేపట్టారు.
దీంతో మరింత రగిలిపోతున్న ఇజ్రాయెల్.. ఖమేనీ స్ధానంలో ఎవరు వచ్చినా వారినీ వదిలిపెట్టబోమన్న హెచ్చరికలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో మొజ్తబా ఖమేనీ భద్రతపై ఆందోళన పెరుగుతోంది. దీనిపై చైనా (china) తాజాగా స్పందించింది. ఇరాన్ లో కొత్తగా నియమితులైన సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీని లక్ష్యంగా చేసుకోవడంపై చైనా ఇవాళ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరాన్ లో హత్యకు గురైన తండ్రి అలీ ఖమేనీ వారసుడికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ సైన్యం బెదిరింపుల నేపథ్యంలో ఆయనను లక్ష్యంగా చేసుకోవడంపై తాము వ్యతిరేకిస్తున్నట్లు చైనా తెలిపింది.

మోజ్తాబా ఖమేనీని నియమించాలనే ఇరాన్ నిర్ణయాన్ని వారి అంతర్గత విషయంగా చైనా పేర్కొంది. ఏ సాకుతోనైనా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని చైనా వ్యతిరేకిస్తుందని తెలిపింది. ఇరాన్ సార్వభౌమాధికారం, భద్రత , ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ ఇజ్రాయెల్ కు హితవు పలికారు. ఇరాన్ రాజ్యాంగ ప్రక్రియ ద్వారా మోజ్తబా పేరును ఖరారు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులను చైనా గతంలో చట్టవిరుద్ధమైన దురాక్రమణగా ఖండించింది. కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది.
-
ఇరాన్ తో డీల్ లేనట్లేనా ? సర్వనాశనమే- ట్రంప్ ఫైనల్ వార్నింగ్..! -
వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన -
ఇరాన్ లో మా టార్గెట్ అదే..! అసలు ప్లాన్ బయటపెట్టిన ట్రంప్..! -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications