వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

#Condom Shortage: కంపెనీల లాక్‌డౌన్, 10 రోజుల నుంచి నిలిచిన ఉత్పత్తి, 100 మిలియన్ల..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ అన్నిరంగాలపై ప్రభావం చూపింది. వైరస్ నివారణకు మందు లేకపోవడం.. సోషల్ డిస్టన్స్ ముఖ్యమని ప్రభుత్వాలు ప్రకటించడంతో అత్యవసరం తప్ప మిగతా సంస్థలు/కంపెనీలు మూసివేశారు. అందులో కండోమ్ కంపెనీలు కూడా ఉన్నాయి. కండోమ్ ఉత్పత్తి నిలిచిపోయి 10 రోజులవుతోంది. దీంతో కండోమ్ షర్టేజ్ ఏర్పడబోతోంది.

10 రోజుల క్రితం..

10 రోజుల క్రితం..

ప్రపంచంలో కండోమ్ ఉత్పత్తికి పేరుగాంచిన మలేసియా కంపెనీ కారెక్స్ బీహెచ్‌‌డీ తన ఉత్పత్తిని పదిరోజుల క్రితం నిలిపివేసింది. మలేసియాలో గత 3 కంపెనీల్లో కండోమ్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఒక్క మలేసియా కాదు ఇతర దేశాల్లో కూడా కండోమ్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో 100 మిలియన్ల కండోమ్ కొరత ఏర్పడింది. వైరస్ వల్ల కండోమ్‌ ఉత్పత్తి నిలిచిపోయిందని కారెక్స్ కంపెనీ సీఈవో గోహ్ మిహ్ కియట్ రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. ఇది ఆందోళనకు గురిచేస్తోందని తెలిపారు. అయితే కండోమ్‌ల కొరత వారమో, రెండు వారాలకో పరిమితం కాదని.. నెలల పాటు కొనసాగుతోందని స్పష్టంచేశారు.

మలేషియా, చైనా, భారత్..

మలేషియా, చైనా, భారత్..

మలేషియాలో ఇప్పటికే 2 వేల 161 మందికి కరోనా వైరస్ సోకగా.. 26 మంది చనిపోయారు. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించడంతో.. కంపెనీలను మూసివేశారు. మలేసియానే కాదు వైరస్ వ్యాపించిన చైనాలో కూడా కంపెనీలను మూసివేసిన సంగతి తెలిసిందే. ఇండియా, థాయ్‌లాండ్ ఫ్యాక్టరీలు కూడా మూసివేయడంతో.. కండోమ్ ఉత్పత్తి ఆగిపోయింది.

కండోమ్‌‌తోపాటు..

కండోమ్‌‌తోపాటు..

మలేసియాలో కండోమ్‌లే కాదు గ్లౌవ్స్, ఇతర పరికరాలు కూడా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆపత్కాల సమయంలో ఇతర వస్తువుల తయారీకి మలేసియా ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, దేశంలో సగం మంది కార్మికులు ఆ రంగాల్లో పనిచేస్తున్నారని కారెక్స్ బీహెచ్‌‌డీ కంపెనీ సీఈవో గోహ్ పేర్కొన్నారు. వాస్తవానికి కండోమ్‌ల డిమాండ్ ఎక్కువగా ఉందని అంగీకరించారు. వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో దంపతులు పిల్లలు కనేందుకు ఇష్టం చూపించడం లేదని పేర్కొన్నారు. ఇది వారికి అనిశ్చితితో కూడిన సమయం అని తెలిపారు. అయితే డ్యూరెక్స్ బ్రాండ్‌కు చెందిన కండోమ్‌లు బ్రిటన్ ఎన్‌హెచ్ఎస్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కొద్దిమొత్తంలో కండోమ్‌లను పంపిణీ చేస్తోంది.

English summary
Malaysia's Karex Bhd not produced a single condom from its three Malaysian factories in the past 10 days due to a lockdown imposed by the government to halt the spread of the virus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X