Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎయిర్ ఏషియా: షాకింగ్ 'లీక్'! 'సెల్ఫీ' ద్వారా ఆమెకు తెలిసింది..

జకర్తా: 162 మందితో కూడిన ఎయిర్ ఏషియా జావా సముద్రంలో కూలిన విషయం తెలిసిందే. దీనిపై మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. కూలిపోయిన విమానం విషయంలో అధికారులు వాతావరణ పరిస్థితి చెప్పే విషయంలో నిబంధనలు పాటించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

విమానం టేకాఫ్‌కు ముందు పైలట్‌కు వాతావరణ పరిస్థితి తెలియదని తెలుస్తోంది. ఈ విషయం ఓ లీకైన డాక్యుమెంట్ ద్వారా బయటకు వచ్చిందని అంటున్నారు. ఏజెన్సీ నుండి పైలట్ ఎలాంటి వెదర్ రిపోర్ట్ పొందలేదని అంటున్నారు.

ఎయిర్ ఏషియా సురబయ నుండి సంఘటన జరిగిన రోజు ఉదయం 5.35 నిమిషాలకు టేకాఫ్ అయింది. ఎయిర్ ఏషియా ఉదయం ఏడు గంటలకు వెదర్ రిపోర్ట్ పొందిందని తెలుస్తోంది.

'Crashed AirAsia jet's pilots did not get weather report'

సెల్ఫీ ద్వారా....

25 ఏళ్ల యువతి ఎయిర్ ఏషియా విమానంలో ప్రాణాలు కోల్పోయిన తన సోదరుడి మృతదేహాన్ని తనకు వచ్చిన సెల్ఫీ ఆదారంగా గుర్తు పట్టింది. తన సోదరుడి యొక్క స్నేహితుడు ఒకతను యునితా శ్యావల్ అనే సదరు యువతికి ఓ సెల్ఫీని పంపించాడు.

తన సోదరుడు హెండ్రా గునావన్ శ్యావల్ అదే విమానంలో ఉన్నట్లుగా ఆ సెల్ఫీలో ఆమె గుర్తించింది. సోదరుడు విమానం ఎక్కే ముందు తన స్నేహితులతో కలిసి అక్కడ సెల్ఫీ తీసుకున్నాడు. దానిని అతని స్నేహితుడు ఒకతను మృతి చెందిన వ్యక్తి సోదరి అయిన యునితా శ్యావల్‌కు పంపించాడు.

సురబయలో ఆమె, సోదరుడు కలిసి లాజిస్టిక్స్ బిజినెస్ చేస్తున్నారు. వారు ఎప్పుడు ఫోన్లో కాంటాక్ట్‌లో ఉంటారు. ప్రతి విషయాన్ని చెప్పుకుంటారు. అయితే, ఆ రోజు మాత్రం సోదరుడు తాను న్యూఇయర్ కోసం సింగపూర్ వెళ్తున్న విషయాన్ని చెప్పలేదు. అయితే, ఆ సెల్ఫీ ద్వారా తన సోదరుడు ఆ విమానంలో ఉన్నాడని తెలుసుకున్న యువతి కన్నీరుమున్నీరు అయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+