ఆ ద్వీపదేశంలో పెనుభూకంపం: సునామీ భయం: తీర ప్రాంతాల్లో అలజడి
నికోసియా: ద్వీపదేశం సైప్రస్‌లో పెను భూకంపం సంభవించింది. దీని తీవ్రతకు తీర ప్రాంతాలన్నీ అలజడికి గురయ్యాయి. సముద్రంలో భూకంపం సంభవించడం వల్ల సునామీ వస్తుందనే భయాందోళనలు వ్యక్తమౌతోన్నాయి. దీనికి అనుగుణంగా సునామీ అలర్ట్‌ను జారీ చేశారు అధికారులు. సునామీ సంభవించే ప్రమాదం ఉందంటూ హెచ్చరించారు. భూకంపం ధాటికి పలు భవనాలు బీటలు వారాయి. భయంతో జనం వీధుల్లోకి పరుగులు తీశారు. ఇప్పటిదాకా ప్రాణనష్టం సంభవించినట్లు వార్తలు రాలేదు.
సైప్రస్‌లోని నార్త్ నికోసియా వద్ద స్థానిక కాలమానం ప్రకారం.. తెల్లవారు జామున 6:37 నిమిషాలకు ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైంది. నార్త్ నికోసియాకు పశ్చిమ దిశగా 137 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే తెలిపింది. దీని తీవ్రతను దృష్టిలో ఉంచుకుని- భూకంపం సంభవించిన కొద్ది క్షణాల్లోనే సైప్రస్ ప్రభుత్వం సునామీ అలర్ట్‌ను జారీ చేసింది. ఆ తరువాత దాన్ని ఉపసంహరించుకుంది.

ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.6గా రికార్డయినట్లు యూరోపియన్-మిడ్ టెర్రయిన్ సెస్మలాజికల్ సెంటర్ తెలిపింది. నార్త్ నికోసియా నుంచి పశ్చిమం వైపు 137 కిలోమీటర్ల దూరంలో ఉపరితలం నుంచి రెండు కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో చోటు చేసుకున్న కదలికల వల్ల ఈ భూకంపం సంభవించినట్లు స్పష్టం చేసింది. సముద్రంలో భూమి కంపించడం వల్ల సునామీ ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. తీర ప్రాంతంల్లో అలజడి ఏర్పడింది. సముద్రం అల్లకల్లోలంగా మారింది.
Recommended Video
దీని తీవ్రత సమీపంలో ఉన్న లెబనాన్, సిరియా తీర ప్రాంతాల్లో కనిపించింది. ఆయా దేశాల సముద్ర తీర ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. తీరం వద్ద అలలు ఉవ్వెత్తున ఎగిసి పడే ప్రమాదం ఉందని హెచ్చరికలను జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వీలైనంత వరకు తీర ప్రాంతాలకు వెళ్లడాన్ని మానుకోవాలని స్థానిక ప్రజలకు సూచించింది. స్థానిక అధికారులను అప్రమత్తం చేసింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications