రికార్డ్ బ్రేక్.. 90 ఏళ్ల వయసులో దలైలామాకు ప్రతిష్టాత్మక అవార్డు

టిబెట్ బౌద్ధ గురువు, ప్రపంచ శాంతి దూతగా గుర్తింపు పొందిన దలైలామా ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డును సొంతం చేసుకున్నారు. 90 ఏళ్ల వయసులో 'బెస్ట్ ఆడియో బుక్, నెరేషన్ అండ్ స్టోరీటెల్లింగ్ రికార్డింగ్' విభాగంలో ఆయనకు అవార్డు లభించడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఇదే ఆయనకు మొదటి గ్రామీ అవార్డు కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ మేరకు దలైలామాకు విషెస్ తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

కాగా ఈ పురస్కారం దలైలామా రూపొందించిన 'Meditations: The Reflections of His Holiness The Dalai Lama' అనే ఆడియో ఆల్బమ్‌కు వరించింది. ఈ ఆల్బమ్‌లో ధ్యానం, అంతర్గత శాంతి, కరుణ, మానవత్వం, ఆత్మపరిశీలన వంటి అంశాలపై ఆడియో సందేశాలు ఉన్నాయి. నేటి ఒత్తిడితో నిండిన జీవనశైలిలో మానసిక ప్రశాంతతను ఎలా సాధించాలి అనే అంశంపై ఈ ఆల్బమ్ ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది.

dalai-lama-who-was-tibetan-buddhist-monk-receives-prestigious-award-at-age-90-and-create-record

ఈ ఆడియో ప్రాజెక్ట్‌కు ప్రఖ్యాత భారతీయ సరోద్ విద్వాంసుడు అంజద్ అలీ ఖాన్ నేపథ్య సంగీతాన్ని అందించడం మరో ఆకర్షణగా మారింది. ఆయన అందించిన ధ్యానాత్మక స్వరాలు దలైలామా సందేశాలకు మరింత భావం తీసుకువచ్చాయని సంగీత కళాకారులు ప్రశంసిస్తున్నారు.

సంగీత రంగంలో అత్యంత గౌరవప్రదమైన గ్రామీ అవార్డుల వేడుక ఈసారి అమెరికా రాష్ట్రం కాలిఫోర్నియాలో ఘనంగా జరిగింది. ది రికార్డింగ్ అకాడమీ నిర్వహించిన 68వ గ్రామీ అవార్డుల కార్యక్రమంలో, ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలు, సంస్కృతులను ప్రతిబింబించే పాటలు, ఆల్బమ్‌లు, ఆడియో ప్రాజెక్టులు పురస్కారాలు అందుకున్నాయి. దలైలామాకు లభించిన ఈ గ్రామీ అవార్డు, సంగీతానికే పరిమితం కాకుండా ఆధ్యాత్మికత, సామాజిక స్పృహ, మానవ విలువలకు కూడా అంతర్జాతీయ గుర్తింపుగా భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+