దలైలామా గెలుపు – చైనా ఆగ్రహం! ప్రపంచం చూపు ఇక్కడే

ప్రపంచం ఒకవైపు ఆధ్యాత్మికతకు తలవంచుతుంటే, మరోవైపు రాజకీయాలు అదే సంఘటనను వివాదంగా మార్చుతున్నాయి. టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డు లభించడంతో అంతర్జాతీయ వేదికపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కానీ ఈ గౌరవం చైనాతో ఉన్న ఉద్రిక్తతలకు మరోసారి తెరలేపింది.

'Meditations: The Reflections of His Holiness the Dalai Lama' పేరుతో రూపొందిన ప్రసంగాల ఆల్బమ్‌కు దలైలామాకు 'ఆడియో బుక్స్, నరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్' విభాగంలో గ్రామీ అవార్డు దక్కింది. 90 ఏళ్ల వయసులో ఆయనకు గోల్డెన్ గ్రామోఫోన్ లభించడం ఇదే తొలిసారి. లాస్ ఏంజెలెస్‌లోని క్రిప్టోడాట్‌కామ్ ఎరీనాలో ఆదివారం రాత్రి జరిగిన వేడుకలో ఈ అవార్డులను ప్రకటించారు.

Dalai Lama Wins First Grammy Award Amid China Tensions Sparking Global Praise and Strong Political Reactions

ఈ వార్త వెలువడిన వెంటనే, దలైలామా నివసిస్తున్న హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులు సంబరాల్లో మునిగిపోయారు. దలైలామా తరఫున ప్రముఖ గాయకుడు రఫూస్ వెయిన్‌రైట్ వేదికపైకి వచ్చి అవార్డును స్వీకరించారు.

ఈ ఆల్బమ్ రూపకల్పనలో గాయనులు మ్యాగీ రోజర్స్, ఆండ్రా డే పాల్గొనగా, సంగీత నిర్మాత కబీర్ సెహగల్ నిర్మించారు. సరోద్ విద్వాంసుడు ఉస్తాద్ అంజాద్ అలీ ఖాన్, ఆయన కుమారులు అమాన్ అలీ బంగాష్, అయాన్ అలీ బంగాష్, అమెరికన్ శాక్సాఫోన్ కళాకారుడు టెడ్ నాష్, గాయని-గేయరచయిత డెబీ నోవా వంటి ప్రముఖుల సహకారంతో ఈ ఆల్బమ్‌కు ప్రత్యేకత వచ్చింది.

అవార్డు దక్కిన తర్వాత దలైలామా స్పందిస్తూ, "దీనిని నేను వ్యక్తిగత ఘనతగా భావించడం లేదు. కృతజ్ఞతతో, మానవత్వంతో ఈ గౌరవాన్ని స్వీకరిస్తున్నాను. ఇది ప్రపంచవ్యాప్తంగా నేను నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక బాధ్యతలకు లభించిన గుర్తింపుగా భావిస్తున్నాను" అని చెప్పారు.

అయితే ఈ గౌరవం చైనాకు తీవ్ర అసంతృప్తిని కలిగించింది. దలైలామాను రాజకీయ శరణార్థిగా పేర్కొన్న చైనా ప్రభుత్వం, ఆయన మతాన్ని ముసుగుగా పెట్టుకుని దేశ విభజన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ, చైనాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వ్యక్తికి అంతర్జాతీయ అవార్డు ఇవ్వడాన్ని తమ దేశం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.

ఇప్పటికే టిబెట్ అంశంపై దలైలామా-చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో, ఈ గ్రామీ అవార్డు వ్యవహారం కొత్త రాజకీయ చర్చకు దారి తీసింది. ఒకవైపు ప్రపంచం ఆయన ఆధ్యాత్మిక సందేశానికి గౌరవం ఇస్తుంటే, మరోవైపు చైనా మాత్రం దీనిని రాజకీయ కోణంలో చూసి విమర్శలు గుప్పిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+