డెలాయిట్ సర్వర్ హ్యాక్: యూఎస్ గవర్నమెంట్ సహా 350క్లైంట్ల కీలక సమాచారం తస్కరణ

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్‌: టెక్, అకౌంటెన్సీ దిగ్గజం డెలాయిట్‌ కంపెనీకి చెందిన సర్వర్‌ హ్యాక్‌ అయింది. డెలాయిట్‌కు చెందిన 350 క్లయింట్ల వివరాలు తస్కరణకు గురైనట్లు సమాచారం. సంస్థలోని సమాచారం చోరికి గురైన క్లయింట్లలో అమెరికా ప్రభుత్వానికి చెందిన నాలుగు డిపార్ట్‌మెంట్లు కూడా ఉన్నట్లు తెలిసింది.

ఈ మేరకు అంతర్జాతీయ పత్రిక ది గార్డియన్ ఓ కథనాన్ని ప్రచురించింది. డెలాయిట్‌ ఊహించిన దాని కంటే పెద్ద మొత్తంలో డేటా చోరికి గురైందని హ్యాకింగ్‌ నిపుణులు భావిస్తున్నారు. కాగా, ఏంత మొత్తంలో సమాచారం చోరికి గురైందన్న విషయంపై డెలాయిట్‌ ఇంకా పెదవి విప్పడం లేదు.

 Deloitte hack hit server containing emails from across US government

కేవలం ఆరుగురు క్లయింట్లకు చెందిన సమాచారమే హ్యాకింగ్‌కు గురైనట్లు డెలాయిట్‌ చెబుతోంది. కాగా, అమెరికాకు చెందిన రాష్ట్ర, ఎనర్జీ, హోం ల్యాండ్‌ సెక్యూరిటీ, రక్షణ శాఖ డిపార్ట్‌మెంట్లకు చెందిన వివరాలు తస్కరణకు ఈ వ్యవహారం గురించి తెలిసిన వ్యక్తులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The hack into the accountancy giant Deloitte compromised a server that contained the emails of an estimated 350 clients, including four US government departments, the United Nations and some of the world’s biggest multinationals, the Guardian has been told.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి