ఎయిర్‌హోస్టెస్‌ల ఫైట్: విమానం అత్యవసర ల్యాండింగ్
న్యూయార్క్: గాలిలో ప్రయాణిస్తున్న విమానంలో ఇద్దరు ఎయిర్‌హోస్టెస్‌ల మధ్య రాజుకున్న గొడవ తీవ్రంగా మారింది. ఎంతకీ ఆ గొడవ సద్దుమణగకపోవడంతో పైలట్ విమానాన్ని అత్యవసరంగా దించివేయాల్సి వచ్చింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్‌లైన్స్‌కి చెందిన బోయింగ్ 757-200 విమానం లాస్‌ఏంజెల్స్ నుంచి మిన్నియాపొలిస్‌కి వెళ్లాల్సి ఉంది. విమానం బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఇద్దరు ఎయిర్‌హోస్టెస్‌లు పని ఒత్తిడి ఎక్కువగా ఉందంటూ వాదులాటకు దిగారు. వారికి సర్దిచెప్ప ప్రయత్నించిన మూడో ఎయిర్‌హోస్టెస్‌ని ఏకంగా చెంప పగలగొట్టారు.

విషయం తెలుసుకున్న పైలట్ ఎయిర్ ట్రాఫిక్ అధికారుల అనుమతితో విమానాన్ని ఉటాలోని సాల్ట్‌లేక్ సిటీలో దించేశాడు. కాగా, క్రమశిక్షణారహితంగా ప్రవర్తించిన ముగ్గురు సిబ్బందిని విధుల్లోంచి తొలగించేశారు.
అధికారులు ప్రత్యామ్నాయ సిబ్బందిని ఏర్పాటుచేయగా విమానం తిరిగి మిన్నియాపొలిస్‌కి చేరుకుంది. ఈ నేపథ్యంలో జరిగిన ఆలస్యానికి గాను విమానంలోని 300 మంది ప్రయాణికులను క్షమాపణలు కోరుతూ డెల్టా ఎయిర్‌లైన్స్ యాజమాన్యం లేఖ పంపింది.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications