Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎంహెచ్ 370, 17 ఎఫెక్ట్: ఎయిర్ లైన్స్ పేరు మార్పు!

కౌలాలంపూర్: ఎంహెచ్ 370, ఎంహెచ్ 17 ప్రమాదాల నేపథ్యంలో మలేషియా ఎయిర్ లైన్స్ విమానం పేరును మార్చుకోనుందని వార్తలు వెలువడుతున్నాయి. ఆరు నెలల వ్యవధిలోనే మలేషియన్ ఎయిర్ లైన్స్ విమానాలు రెండు కూలిపోయాయి. ఈ నేపథ్యంలో... సంస్థ కోల్పోయిన ప్రతిష్టను తిరిగి నిర్మించే పనిలో పడింది.

ఇందులో భాగంగా మలేషియా ఎయిర్ లైన్స్ పేరును మార్చనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జరిగిన నష్టాన్ని పూడ్చుకుని పునర్నిర్మించుకోవాలని చూస్తున్నట్లు యూకె టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంది.

Disaster-struck Malaysia Airlines to change name: Report

ఎయిర్ లైన్స్‌లో మెజారిటీ శాతం ప్రభుత్వానిదే. అయితే, సంస్థలో కొత్త పెట్టుడిదారులను ఎదురుచూస్తోంది. అంతేకాక సంస్థ లాభదాయకతకోసం అవుట్ సోర్సింగ్‌ను విస్తరించాలనుకుంటోంది. ఆరు నెలల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో 537 మంది మరణించారని పత్రిక వివరించింది.

ఈ ఏడాది మార్చిలో ఎంహెచ్ 370 విమానం గల్లంతయింది. కౌలాలంపూర్ నుండి బీజింగ్‌కు వెళ్తున్న ఈ విమానంలో 239 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఇందులో ఐదుగురు బారతీయులు ఉన్నారు. క్రూ మెంబర్స్ కూడా ఉన్నారు. ఆ తరవాత ఎంహెచ్ 17 ప్రమాదంలో 298 మంది చనిపోయారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+