Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bashar Al-Assad: డాక్టర్ నుంచి సిరియా అధ్యక్షుడిగా ఎదిగి, దేశం నుంచి పరారైన అస్సాద్..!

సిరియాలో రెబెల్స్ తో పోరాడలేక దేశం వదిలి పారిపోయిన దేశాధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ దాదాపు పాతికేళ్ల పాటు దేశాన్ని పాలించారు. డాక్టర్ గా ఉంటూ దేశాధ్యక్షుడైన ఆయన.. తనను తాను ప్రజా నాయకుడిగా మార్చుకుని ఇన్నాళ్లు సిరియాను పాలించారు. రష్యా, ఇరాన్ వంటి దేశాలకు సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న అస్సాద్ చివరికి వాళ్లు కూడా రక్షించలేని పరిస్ధితుల్లో దేశం వదిలి వెళ్లాల్సి వచ్చింది. అయితే డాక్టర్ నుంచి దేశం వదిలే వరకూ సాగిన ఆయన ప్రస్ధానం ఓసారి చూద్దాం...

1994లో సిరియా అధ్యక్షుడు హఫీజ్ అల్ అస్సాద్ కుమారుడు, బషర్ అన్న అయిన బాసిల్ ను ప్రత్యర్థులు హత్య చేశారు. దీన్ని అప్పట్లో ప్రభుత్వం కారు ప్రమాదంగా చెప్పుకుంది. అప్పట్లో లండన్ లో డాక్టర్ చదువు చదువుకుంటున్న బషర్ కు తన అన్న స్ధానం భర్తీ చేయాల్సిన పరిస్ధితి ఎదురైంది. అయితే వెంటనే అతను సిరియా రాలేదు. కానీ బ్రిటిష్ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి బషర్ తండ్రి హఫీజ్ పాలన అంటే అంటే ఏంటో నేర్పుతూ పెంచారు.

Doctor Bashar-Al-Assad s rise to power and downfall in these 24 years finally fled syria

తొలుత మొండివాడిగా ఉండే బషర్..ఆ తర్వాత ప్రజల్లో కలిసిపోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత 2000లో దేశాధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. 2009 నాటికి అత్యంత ప్రజాదరణ గల నాయకుడిగా అస్సాద్ పేరు తెచ్చుకున్నారు. 68 శాతం అరబ్బులు ఆయన్ను ఆమోదించారు. దేశంలో ఆర్ధిక సంస్కరణలు అమలు చేయడం మొదలుపెట్టాక పరిస్ధితులు మారిపోయాయి. ఆర్దిక సంస్కరణలు ఆధునీకీకరణకు దారి తీసినా సామాజిక న్యాయాన్ని విస్మరించడంతో జనంలో అసంతృప్తి మొదలైంది.

అప్పటికే ట్యునీషియా, ఈజిప్ట్, లిబియాల్లో ప్రభుత్వాలపై నిరసనలు తలెత్తాయి. ఇవి సిరియాకూ పాకాయి. వీటిని ఉక్కుపాదంతో అణచివేసేందుకు అస్సాద్ చేసిన ప్రయత్నాలతో అంతర్యుద్ధం తలెత్తింది. అలా మొదలైన అంతర్యుద్దంలో రెబెల్స్ కు అమెరికా మద్దతిస్తే అస్సాద్ కు రష్యా, ఇరాన్, హెజ్బొల్లా గ్రూపు మద్దతిచ్చాయి. అస్సాద్ వద్ద రసాయన అస్త్రాలు ఉన్నాయన్న ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో ఎంట్రీ ఇచ్చిన ఐసిస్ సిరియా భూభాగాల్ని అదుపులోకి తీసుకోవడం మొదలుపెట్టింది..

2013 తర్వాత రష్యా,ఇరాన్, హెజ్బొల్లా సాయంతో రెబెల్స్ ను అస్సాద్ అణచివేశారు. అప్పటి నుంచి రెబెల్స్ వివిధ రూపాల్లో రూపాంతరం చెంది అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. గతేడాది తలెత్తిన రష్యా-ఉక్రెయిన్ యుద్దం, తాజా ఇజ్రాయెల్-ఇరాన్ వార్, హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు, రెబెల్స్ కు టర్కీ మద్దతివ్వడం వంటి పరిణామాలు అస్సాద్ కు ఇబ్బందికరంగా మారాయి. ఎవరికి వారు ప్రత్యర్దులతో యుద్ధాలతో బిజీగా ఉంటూ సిరియాలో ఉన్న అస్సాద్ ను పట్టించుకోలేకపోయాయి. ఇది చివరికి రెబెల్స్ కు వరంగా మారింది. అస్సాద్ ను దేశం నుంచి తరిమికొట్టేశారు. దీంతో ఆయన కుటుంబంతో పాటు రష్యా వెళ్లి తలదాచుకుంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+