పన్ను చట్టాల్లో లొసుగులతో వ్యాపారంలో లబ్ది పొందాను : ట్రంప్ సంచలనం
వాషింగ్టన్ : పన్నుల గురించి డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అమెరికన్ పన్ను విధానంలో ఉన్న లొసులగులను ఆసారాగా చేసుకుని వాటిని తన వ్యాపార ఎదుగుదలకు అనుకూలంగా మార్చుకున్నానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. న్యూయార్క్ టైమ్స్ కథనం తర్వాత దీనిపై స్పందించిన ట్రంప్ కూడా కథనంలో ప్రస్తావించిన అంశాలను సమర్థించుకునేలా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
పన్ను చట్టాల్లోని లొసుగులను తన వ్యాపారానికి అనుకూలంగా మలుచుకున్న ట్రంప్.. ఎప్పుడూ తక్కువ పన్నులే చెల్లిస్తున్నారంటూ న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. కాగా, కొలరాడో ప్రాంతంలో ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ దీనిపై స్పందించారు. పన్ను చట్టాల్లోని లొసుగులని ఉపయోగించుకుని తాను లాభపడ్డది నిజమేనని ఒప్పుకున్నారు. అయితే తాను అధికారంలోకి వస్తే మాత్రం పన్ను చట్టాలను సవరిస్తానని చెప్పారు.

పన్ను చట్టాల్లోని అనుచిత వైఖరిని నమ్మలేమని చెప్పిన ట్రంప్ ఈ చట్టాల వల్ల తాను చాలానే లబ్ది పొందినట్టు తెలిపారు. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ఎఫ్.సీ న్యూస్ ద్వారా వెల్లడయింది. అయితే ఇదే విషయంపై స్పందిస్తూ.. తన ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ పైన ఆరోపణలు గుప్పించారు ట్రంప్. తాను విజయవంతమైన వ్యాపారవేత్తగా డబ్బు సంపాదిస్తే.. హిల్లరీ మాత్రం అవినీతి రాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపించారు. చట్టాన్ని సైతం ఉల్లంఘించి తన ప్రభుత్వ కార్యాలయాన్ని అమ్మకానికి కూడా పెట్టేశారని ట్రంప్ పేర్కొన్నారు.
-
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
ఖమేనీ సంధి ఒప్పందం? -
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్











Click it and Unblock the Notifications