Iran Israel war: ఇజ్రాయెల్ ను రెచ్చగొడుతున్న ట్రంప్? బైడెన్ వద్దన్నదే చేయమని సలహా..!
ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య దశాబ్దాలుగా సాగుతున్న పోరుకు కొనసాగింపుగా లెబనాన్, ఇరాన్ వంటి దేశాలు ఎంట్రీ ఇవ్వడం, వాటిపైనా దాడులకు ఇజ్రాయెల్ తెగబడుతున్న నేపథ్యంలో అమెరికా పాత్ర కీలకంగా మారింది. అమెరికా ప్రభుత్వం నుంచి వస్తున్న ఆదేశాల మేరకే ఇజ్రాయెల్ అడుగులు వేస్తోంది. ఇలాంటి తరుణంలో ఇజ్రాయెల్ పై తాజాగా ఇరాన్ దాదాపు 200 మిసైళ్లను ప్రయోగించడంతో వాటిని కూడా అమెరికా కొంత మేర అడ్డుకుంది. అయితే ఇరాన్ దాడికి ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్న ఇజ్రాయెల్ కు అమెరికా ఇస్తున్న సలహాలు చికాకు పెడుతున్నాయి.
ముఖ్యంగా ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులకు అనుకూలంగానే ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఈ క్రమంలో వారి అణు కేంద్రాల్ని మాత్రం ముట్టుకోవద్దంటూ ఇచ్చిన సలహా చర్చనీయాంశమైంది. అయితే పశ్చిమాసియా సంక్షోభం కాస్తా మూడో ప్రపంచ యుద్ధంగా మారకుండా ఉండేందుకు బైడెన్ ఈ సలహా ఇచ్చారన్న చర్చ కూడా జరుగుతోంది. దీంతో ఇజ్రాయెల్ కూడా ఇరాన్ అణు కేంద్రాల్ని టార్గెట్ చేసేందుకు సిద్ధంగా లేదు. ఈ సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇజ్రాయెల్ ను రెచ్చగొట్టే ప్రకటన చేశారు.

ఇరాన్ ను ఎక్కడెక్కడో కొడితే సరిపోదని, వారి అణు కేంద్రాల్ని టార్గెట్ చేయాలని ఇజ్రాయెల్ కు తాజాగా డొనాల్డ్ ట్రంప్ సలహా ఇచ్చారు. తాజాగా నార్త్ కరోలినాలో జరిగిన ప్రచార కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ యొక్క అణు కార్యక్రమాన్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకునే అవకాశం గురించి తాజాగా అధ్యక్షుడు జో బిడెన్ కు ఎదురైన ప్రశ్నను ప్రస్తావించారు. ఇజ్రాయెల్ ఇరాన్ అణు కేంద్రాల్ని లక్ష్యంగా చేసుకోవాలా అని అడిగితే ఆయన వద్ద సమాధానం లేదన్నారు. కానీ తాను ఈ ప్రశ్నకు సమాధానం చెప్తానన్నారు.
ఇరాన్ అణుకేంద్రాల్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోవడం తప్పని బైడెన్ భావిస్తున్నారని, కానీ ముందుగా వాటినే టార్గెట్ చేయాలని ఇజ్రాయెల్ కు ట్రంప్ సూచించారు. ఎందుకుంటే అణ్వాయుధాలు మనకు ఉన్న అతి పెద్ద ప్రమాదమని ట్రంప్ వెల్లడించారు. ముందు వాటిపై దాడి చేశాకే మిగతా వాటి గురించి ఆలోచించాలని ఇజ్రాయెల్ కు ట్రంప్ సలహా ఇచ్చారు.
-
అమెరికా 'యుద్ధ విమానాలు' కాదు అట్ట పెట్టెలు.. మా 'రఫేల్' నయం..! -
యూఎస్ తో తలపడుతున్న ఇరాన్ బలాలేంటి? యుద్ధంలో ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? -
అమెరికా యుద్ధ విమానాల్లో నుంచి దూకేసిన పైలట్లు-పట్టిస్తే ఇరాన్ భారీ బౌంటీ..! -
F-35 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్.. అమెరికాలో చేయి దాటిన పరిస్థితి! -
Hormuz: హార్ముజ్ లో అసలు నష్టం భారత్ కే? కేంద్రం షాకింగ్ ..! -
ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ‘బాబ్ అల్ మాండెబ్’..? -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం..












Click it and Unblock the Notifications