వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ మన జాబ్స్ దొంగిలిస్తోంది, గోడ కడతా: ట్రంప్

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారత్ పైన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌లాంటి దేశాలు అమెరికాలోని యువతకు ఉద్యోగాలను దక్కనీయకుండా చేస్తున్నాయని మండిపడ్డారు.

అమెరికా దేశ యువతకు ఎలాగైనా ఉపాధి కల్పిస్తామని చెప్పారు. కొలంబియా విమానాశ్రయంలో స్థానికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అమెరికాను మళ్లీ అత్యున్నత స్థానానికి తీసుకెళ్తానని, దేశంలో ఉన్న ఉద్యోగాల్లో అత్యధిక శాతం భారత్‌, చైనా, జపాన్‌, మెక్సికో లాంటి దేశాలు సొంతం చేసుకుంటున్నాయన్నారు.

Donald Trump blames India for stealing jobs

ఆ ఉద్యోగాలను అమెరికా యువతకు దక్కేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే అమెరికా-మెక్సికో సరిహద్దులో గోడను నిర్మిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక నినాదంతో అమెరికా అధ్యక్ష పదవిలో రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్.. భారతీయుల పైన వరుసగా అక్కసు వెళ్లగక్కుతున్నారు.

English summary
Donald Trump sold the dream of "making America great again" by promising to bring back jobs from countries like India, China, Japan and Mexico.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X