సర్వత్రా సునామీ భయాలు: ఆరా తీసిన ట్రంప్: ఇండియన్ కాన్సులేట్ లో హెల్ప్ లైన్

Russia Earthquake 2025: రష్యాలో భారీ భూకంపం సంభవించింది. అంచనాలకు అందని విధంగా భూమి ప్రకోపించింది. ఆ దేశాన్ని వణికించింది. అత్యంత శక్తిమంతమైన భూకంపం ఇది. దీని ప్రభావం జపాన్ పైనా పడిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

సునామీ హెచ్చరికలు..

భూకంప తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సునామీ హెచ్చరికలను జారీ చేశారు. రష్యా, జపాన్ దేశాలకు సునామీ ముప్పు పొంచివుంది. అమెరికా, ఇతర పసిఫిక్ దేశాలకూ సునామీ హెచ్చరికలు ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా తీర ప్రాంతాలన్నింటినీ కూడా స్థానిక అధికారులు ఖాళీ చేయించారు. ప్రాణనష్టాన్ని తగ్గించడానికి చేయాల్సిందంతా చేస్తోన్నారు.

Donald Trump inquired about the Tsunami Indian consulate set up helpline in San Francisco

పెను భూకంపం

రష్యాలోని కమ్‌చట్‌కా ద్వీపకల్పం సమీపంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 8.7గా నమోదైంది. దీని కారణంగా సునామీ అలలు నాలుగు మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడ్డాయి. దీని ప్రభావంతో పలు భవనాలు దెబ్బతిన్నాయి. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అమెరికా, జపాన్, మరికొన్ని పసిఫిక్ దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

పసిఫిక్ దేశాలకు..

పెట్రోపావ్లోవ్స్క్-కమ్‌ చట్‌స్కీ.. రష్యా సరిహద్దుల్లో ఉంటుంది. జపాన్‌కు ఈశాన్యం, అలాస్కాకు పశ్చిమం దిశగా ఉంటుందీ తీర ప్రాంతం. పసిఫిక్ మహా సముద్ర తీర ఉందిక్కడ. కమ్‌ చట్ స్కీ ఓ ద్వీపకల్పం. పసిఫిక్, నార్త్ అమెరికా టెక్టోనిక్ ప్లేట్‌ల పరిధిలో ఉండటం వల్ల తరచూ భూకంపాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది.

భూకంప కేంద్రం..

అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం- భూకంపం 19.3 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉంది. ఇది అవచా బేలోని పెట్రోపావ్లోవ్స్క్-కమ్‌చట్‌స్కీకి తూర్పు ఆగ్నేయంగా 125 కిలోమీటర్ల దూరంలో గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. ఈ తీర ప్రాంత నగరంలో సుమారు 1,65,000 మంది నివసిస్తున్నారు.

రాకాసి అలలు..

తొలుత భూకంప తీవ్రత 8.0గా అంచనా వేసినప్పటికీ, తరువాత దానిని 8.7గా సవరించారు. భూకంపం తరువాత, కమ్‌చట్‌కా ప్రాంతంలో 3 నుండి 4 మీటర్ల ఎత్తు వరకు సునామీ అలలు నమోదయ్యాయని రష్యా ప్రాంతీయ అత్యవసర పరిస్థితుల మంత్రి లెబెదెవ్ తెలిపారు. తీర ప్రాంతాలను ఖాళీ చేయాలని, నీటి ప్రవాహ ప్రాంతాల నుంచి దూరంగా ఉండాలని సూచించారు.

ఆరా తీసిన ట్రంప్..

ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరా తీశారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. హవాయ్ లో నివసించే వారికి సునామీ హెచ్చరిక అమలులో ఉందని అన్నారు. అమెరికా, అలాస్కాతో పాటు పసిఫిక్ తీరానికి సునామీ హెచ్చరికలు జారీ చేశారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉండాలని సూచించారు.

ఇండియన్ కాన్సులేట్ అడ్వైజరీ

భూకంపం తర్వాత సునామీ ముప్పును పొంచివుండటంతో శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. పరిస్థితులను పర్యవేక్షిస్తోంది. కాలిఫోర్నియా, ఇతర యుఎస్ వెస్ట్ కోస్ట్ రాష్ట్రాలు, హవాయ్ లోని భారతీయ పౌరులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది.

హెల్ప్ లైన్..

స్థానికంగా అధికారులు ఎప్పటికప్పుడు జారీ చేసే హెచ్చరికలు, సూచనలను అనుసరించాలని కోరింది. స్థానిక అత్యవసర నిర్వహణ, యుఎస్ సునామీ హెచ్చరిక కేంద్రాలు, అధికారుల నుండి హెచ్చరికలను జాగ్రత్తగా పర్యవేక్షించాలని సూచించింది. సునామీ సంభవిస్తే ఎత్తైన ప్రదేశానికి వెళ్లాలని, తీరప్రాంతాలకు వెళ్లొద్దని కోరింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ హెల్ప్‌లైన్ నంబర్‌ను +1-415-483-6629ను సంప్రదించాలని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+