వాషింగ్టన్‌లో రెండు వారాలు ఎమర్జెన్సీ- ట్రంప్ కీలక నిర్ణయం- బైడెన్ ప్రమాణస్వీకారం వేళ
వరుస ట్విస్ట్‌లతో సాగిపోతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల తదనంతర పరిణామాల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ట్విస్ట్ ఇచ్చారు. అదీ కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం వేళ కావడం మరో విశేషం. ఇప్పటికే అధ్యక్షుడు జో బైడెన్‌ను అధ్యక్షుడిగా గుర్తిస్తూ అమెరికా ఉభయసభలు ఏర్పాటు చేసిన సంయుక్త సమావేశాన్ని నిరసిస్తూ ట్రంప్ మద్దతుదారులు హింసాత్మక చర్యలకు దిగిన నేపథ్యంలో ట్రంప్ తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. క్యాపిటల్ భవనం బయట జరిగే ఈ కార్యక్రమానికి ట్రంప్ మద్దతుదారుల నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు ఎఫ్‌బీఐ హెచ్చరికలు చేస్తోంది. ఇప్పటికే ట్రంప్ మద్తతుదారుల చర్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వాషింగ్టన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి పూర్తిస్ధాయిలో భద్రత కల్పించడం ఇప్పుడు ట్రంప్‌కు తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో రాజధానిలో రెండు వారాల పాటు ఎమర్జెన్సీ ప్రకటిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.

జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి ఇంకా ఎనిమిది రోజుల సమయం మిగిలి ఉంది. ప్రమాణ స్వీకారం తర్వాత ప్రభుత్వం కొలువుదీరేందుకు మరో వారం రోజుల సమయం ఎలాగో పడుతుంది. దీంతో రెండు వారాల పాటు రాజధానిలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ట్రంప్ ఎమర్జెన్సీ విధించారని వైట్‌హౌస్ ప్రెస్ వర్గాలు వెల్లడించాయి. ట్రంప్ తాజా నిర్ణయంతో వాషింగ్టన్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి ఘటనలు జరగకుండా అడ్డుకునేందుకు అమెరికా హోంల్యాండ్ పోలీసులకు అవకాశం కలుగుతుంది.
-
అమెరికా-ఇజ్రాయెల్ మధ్య విభేదాలు? వాన్స్-నెతన్యాహు సంచలన కాల్ లీక్..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
Iran War: ట్రంప్ సీజ్ ఫైర్ ప్లాన్ పై తేల్చేసిన ఇరాన్- కీలక ప్రకటన..! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం! -
H-1B వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్..! వేతనాల పెంపు ఇలా...! -
Bay of Pigs: క్యూబాలో అమెరికా ఎలా ఓడిపోయి లొంగిపోయింది ? నెక్ట్స్ ఇరానేనా ? -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...!












Click it and Unblock the Notifications