ఇరాన్ నామరూపాలు లేకుండా చేస్తా: ట్రంప్ మాస్ వార్నింగ్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న వైరం మరోసారి పతాక స్థాయికి చేరింది. తన ప్రాణాలకు ముప్పు తలపెట్టాలని చూస్తే ఇరాన్ ను భూస్థాపితం చేస్తానంటూ ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
భూమిపై ఇరానే అనే గుర్తే ఉండదు..
ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ తనపై జరుగుతున్న హత్యాయత్నపు కుట్రల గురించి మాట్లాడుతూ ఇరాన్ పై విరుచుకుపడ్డారు. "ఒకవేళ ఇరాన్ నన్ను చంపడానికి ప్రయత్నిస్తే, నేను ఈ భూమిపై ఇరాన్ అనే దేశం పేరు లేకుండా తుడిచేస్తాను" అని ట్రంప్ హెచ్చరించారు. తన హత్యకు ఇరాన్ గనుక కుట్ర పన్నితే, ఆ దేశం ఎదుర్కోబోయే విధ్వంసాన్ని ఎవరూ ఆపలేరని ఆయన స్పష్టం చేశారు.

ఇరాన్ స్టేట్ మీడియా వివాదాస్పద పోస్ట్
కొన్ని రోజుల క్రితం ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా నేరుగా ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ ఒక సందేశాన్ని ప్రసారం చేసింది. 2024లో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం ఫోటోను చూపిస్తూ, "ఈసారి లక్ష్యం తప్పదు.. బుల్లెట్ నేరుగా తల లోపలికి దూసుకుపోతుంది" అనే హెచ్చరికను ఇరాన్ మీడియా పంపింది. భవిష్యత్తులో ట్రంప్‌పై ఇరాన్ మళ్లీ దాడి చేసే అవకాశం ఉందని అమెరికా నిఘా సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఉరిశిక్షల నిలిపివేతతో తగ్గిన ఉద్రిక్తత.. కానీ!
ప్రదర్శనకారులకు ఉరిశిక్షలు వేయబోమని ఇరాన్ ప్రభుత్వం హామీ ఇవ్వడంతో, ఆ దేశంపై సైనిక దాడి చేసే ప్లాన్‌ను ట్రంప్ ప్రస్తుతానికి వాయిదా వేశారు. అయితే తాజా హెచ్చరికలతో పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చినట్లు కనిపిస్తున్నాయి.
యుద్ధానికి ఇరాన్ సవాల్
అమెరికా తన దేశంలో అధికార మార్పిడి కోసం ప్రయత్నిస్తోందని ఇరాన్ బలంగా నమ్ముతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీపై అమెరికా దాడికి ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని ఇరాన్ ఆర్మీ హెచ్చరించింది. ఇరాన్ సైనిక ప్రతినిధి జనరల్ అబోల్ ఫజల్ శేఖర్చి మాట్లాడుతూ.. "ఖమేనీపై దాడికి ప్రయత్నిస్తే ట్రంప్ చేతులు నరికేస్తాం, అమెరికాపై యుద్ధం ప్రకటిస్తాం" అని ప్రతిజ్ఞ చేశారు.
ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలను బట్టి చూస్తుంటే ఇరాన్ విషయంలో ఆయన చాలా కఠినంగా ఉన్నారని అర్థమవుతోంది. ఇది భవిష్యత్తులో ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమిస్తుందా అన్నది వేచి చూడాలి.
-
F-35 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్.. అమెరికాలో చేయి దాటిన పరిస్థితి! -
నో హార్ముజ్, నో డీల్..! ఒట్టి చేతులతో ఇరాన్ వీడనున్న ట్రంప్..! -
గెట్ అవుట్: నమ్మకమైన స్నేహితురాలికే ట్రంప్ షాక్. -
ఇరాన్ వార్ లోకి రెండు గల్ఫ్ దేశాలు? ట్రంప్ వైఫల్యం వేళ బిగ్ ట్విస్ట్..! -
Iran War: సీజ్ ఫైర్ పై తేల్చేసిన ఇరాన్..! ట్రంప్ కు ఘాటు కౌంటర్..! -
డొనాల్డ్ ట్రంప్ నాన్చివేత ధోరణి- 19 నిమిషాల ప్రసంగంలో ఇరాన్ భవిష్యత్ -
H1B Visa: 85 వేల మందికి లక్కీ ఛాన్స్, సెలెక్షన్ లిస్ట్ వచ్చేసింది! -
ఇజ్రాయెల్ భీకర ప్రతీకారం: హిజ్బుల్లా మాస్టర్‌మైండ్ హతం! -
అగ్నికి ఆజ్యం పోసిన ట్రంప్- క్రూడ్ రేట్లు జంప్ -
Hormuz: హార్ముజ్ కోసం రంగంలోకి 35 దేశాలు-భారత్ కీలక నిర్ణయం..! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ











Click it and Unblock the Notifications