Donald Trump: చమురు ధరలు భరించాల్సిందే-తేల్చేసిన ట్రంప్..!
ఇరాన్ పై ఏకపక్షంగా యుద్ధం ప్రకటించి తాము ఇబ్బందుల్లో పడింది కాక ప్రపంచదేశాల్ని సైతం ఇబ్బందుల్లోకి నెడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump).. ఇప్పుడు ఈ వార్ కారణంగా ఎదురవుతున్న పరిణామాల్ని భరించాల్సిందేనని సంకేతాలు ఇస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్ వార్ కారణంగా చమురు ధరల మంట (oil price hike) తప్పదన్న సంకేతాల నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు ప్రపంచ దేశాల్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టేలా ఉన్నాయి.
ఇరాన్ వార్ నేపథ్యంలో మధ్య ప్రాచ్యంలో చమురు సరఫరా అంతరాయాలు పెరగవచ్చనే ఆందోళనతో పలు దేశాల్లో ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా నాలుగేళ్లలో గరిష్టంగా ముడి చమురు ధర బ్యారెల్ కు 100 డాలర్లకు చేరుకుంది.
దీనిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఈ పెరుగుదలను ఇరాన్ అణు ముప్పును తొలగించడానికి చెల్లించాల్సిన చిన్న ధర అని వ్యాఖ్యానించారు. అలాగే చమురు ధరల పెరుగుదల తాత్కాలికమేనని చెప్పుకొచ్చారు.

ఇరాన్ అణు ముప్పు నాశనం ముగిసినప్పుడు వేగంగా తగ్గే స్వల్పకాలిక చమురు ధరలు, అమెరికా, ప్రపంచం, భద్రత, శాంతికి చెల్లించాల్సిన చాలా చిన్న ధర అని తన ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ చెప్పుకొచ్చారు. మూర్ఖులు మాత్రమే భిన్నంగా ఆలోచిస్తారంటూ మరో కొత్త వాదన కూడా తెరపైకి తెచ్చారు. దీంతో చమురు ధరల పెరుగుదల ఖాయమని, దీనిపై మాట్లాడే వాళ్లంతా మూర్ఖులే అనేలా ట్రంప్ వ్యాఖ్యలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది.

వాస్తవానికి ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి హార్ముజ్ జలసంధిలో సముద్ర రవాణా దాదాపు ఆగిపోయింది . దీని ద్వారానే ప్రపంచ ముడి చమురు, గ్యాస్‌లో 20 శాతం ప్రయాణిస్తుంది. అలాగే గల్ఫ్ చుట్టూ ఉన్న చమురు , గ్యాస్ ఉత్పత్తిదారులు ఉత్పత్తిని తగ్గించడం ప్రారంభించారు. టెహ్రాన్‌లోని ఇంధన డిపోలపై ఇజ్రాయెల్ దాడులు పొరుగు దేశాల మౌలిక సదుపాయాలపై ప్రతీకార దాడుల భయాలను పెంచాయి. ముడి చమురు ధరల పెరుగుదలతో ఇప్పటికే అమెరికాలోని ఇంధన ఖర్చులు పెరిగాయి. ఇది నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలకు దారితీసే అత్యంత సున్నితమైన రాజకీయ సమస్యగా మారిపోయింది. అయినా ట్రంప్ చిన్న విషయమే అంటున్నారు.
-
పాకిస్థాన్ గాలి తీసిన ఇరాన్.. ఎగిరెగిరిపడిన ఆ దేశానికి సడెన్ షాక్.. -
వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన -
ఇరాన్ లో మా టార్గెట్ అదే..! అసలు ప్లాన్ బయటపెట్టిన ట్రంప్..! -
ట్రంప్ ఫోన్లు ఎత్తని ఇరాన్ ? ముందుకెళ్లని చర్చలకు 3 కారణాలు..! -
"ఇరాన్ తో యుద్ధం త్వరలోనే ముగిస్తాం" -
అమెరికా సైన్యం షార్క్‌లకు ఆహారమే: ఇరాన్ భీకర హెచ్చరిక.. -
ఇజ్రాయెల్ కెమికల్ ఫ్యాక్టరీలపై ఇరాన్ క్షిపణుల వర్షం.. లీకైన విష వాయువు..!! -
అమెరికా-ఇజ్రాయెల్ మధ్య విభేదాలు? వాన్స్-నెతన్యాహు సంచలన కాల్ లీక్..! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్











Click it and Unblock the Notifications