డొనాల్డ్ ట్రంప్ బిగ్ యూటర్న్: యూఎస్‌లో ఏం జరుగుతోంది?

Trump Tariff: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. రెండు దేశాలపై విధించిన టారిఫ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. 30 రోజుల పాటు ఈ నిలిపివేత కొనసాగుతుంది. ఆ తరువాత అప్పటి పరిస్థితులను అనుగుణంగా దీన్ని ఎత్తివేయాలా? లేదా? అనేది నిర్ణయం తీసుకుంటారు. మొత్తం మూడు దేశాలపై టారిఫ్‌ను విధించగా.. రెండింటికి మాత్రమే ఊరట లభించింది.

అక్రమ వలసదారులను అడ్డుకోవడం, ఇందులో భాగంగా సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేయడం, ఎలాంటి అధికారిక డాక్యుమెంట్లు లేకుండా ఇప్పటికే తమ దేశంలో నివసిస్తోన్న వాళ్లను వెనక్కి పిలిపించుకోవడంలో విఫలమైనందున కెనడా, మెక్సికో, చైనాపై టారిఫ్ కొరడాను ఝుళిపించారు ట్రంప్.

Donald Trump Pauses Tariffs on Canada Mexico for 30 days

ఈ మూడు దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని రకాల వాహనాలు, వస్తువులు, సరుకులు, ఆహార పదార్థాలపై కొత్త టారిఫ్‌కు అనుగుణంగా డ్యూటీని వసూలు చేయాలనేది దీని ఉద్దేశం. ఈ మూడింట్లో మెక్సికోపై అత్యధికంగా టారిఫ్ భారం పడింది. 25 శాతం టారిఫ్‌ను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కెనడా, చైనాలపై 10 శాతం మేర టారిఫ్‌ను విధించింది అమెరికా.

ఇప్పుడు కెనడా, మెక్సికోపై విధించిన టారిఫ్‌ను నెల రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ విషయాన్ని తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రంప్ ట్రూత్‌ ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా పర్డో, కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోతో ఫోన్‌లో మాట్లాడిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఫెంటానిల్ మాదక ద్రవ్యం అక్రమ రవాణా, వలసదారులను అడ్డుకోవడానికి తక్షణ చర్యలు చేపట్టడానికి క్లాడియా షెన్‌బామ్ అంగీకరించారు. ఫెంటానిల్‌ అక్రమ రవాణాను అరికట్టడానికే అమెరికా- మెక్సికో సరిహద్దుల్లో అదనపు భద్రత సిబ్బందిని మోహరింపజేసినట్లు క్లాడియా వెల్లడించారు.

అలాగే- 1.3 బిలియన్ డాలర్ల అమెరికా- కెనడా సరిహద్దు ప్రణాళికను అమలు చేస్తోన్నట్లు ట్రూడో ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్‌కు వివరించారు. ఇందులో భాగంగా కొత్త హెలికాప్టర్లు, ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం, అదనపు భద్రత సిబ్బందితో సరిహద్దును బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు.

అమెరికా భాగస్వామ్యంతో ఫెంటానిల్ అక్రమ రవాణాను అడ్డుకోవడానికి దాదాపు 10,000 మంది ఫ్రంట్‌లైన్ సిబ్బంది సరిహద్దుల్లో నియమించినట్లు ట్రంప్‌కు వివరించారు. ఫెంటానిల్‌ అక్రమ రవాణాదారు (కార్టెల్స్)లను ఉగ్రవాదులగా పరిగణిస్తామని, వారిని టెర్రరిస్టుల జాబితాలో చేర్చుతామనీ పేర్కొన్నారు. అటు క్లాడియా, ఇటు ట్రూడో ఇచ్చిన హామీల మేరకు టారిఫ్ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేశారు ట్రంప్.

కాగా- 2023లో 1,07,000 మందికి పైగా అమెరికన్లు డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల మరణించారు. ఇందులో దాదాపు 70 శాతం మంది ఫెంటానిల్‌ సహా ఇతర డ్రగ్స్‌ వినియోగం వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్లే. 2024లో అమెరికా దక్షిణ ప్రాంతం సరిహద్దుల్లో దాదాపు 21,900 పౌండ్ల ఫెంటానిల్‌ను కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ స్వాధీనం చేసుకోవడం దీనికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+