డొనాల్డ్ ట్రంప్‌కు తప్పిన మరో ముప్పు
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మొన్నటికి మొన్న హత్యాయత్న నుంచి తృటిలో తప్పించుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న ఆయన పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఏర్పాటు చేసిన ర్యాలీలో ప్రసంగిస్తోన్న సమయంలో కాల్పులు జరిగాయి.
ఈ ఘటనలో ఆయన కుడి చెవికి బుల్లెట్ తగిలింది. రక్తమోడింది. అక్కడే ఉన్న భద్రతసిబ్బంది అతన్ని కాల్చి చంపారు. ఈ ఘటన తరువాత అతి కొద్ది రోజుల్లోనే ఆయన మళ్లీ ఎన్నికల ప్రచార బరిలో దిగారు. హత్యాయత్నం తరువాత విస్కాన్సిస్‌లోని మిల్వాకీలో నేషనల్ కన్వెన్షన్‌లో రిపబ్లికన్ పార్టీ నిర్వహించిన నాలుగు రోజుల వర్క్ షాప్ హాజరయ్యారు.

ఎన్నికల గడువు సమీపిస్తోండటంతో దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తోన్నారు డొనాల్డ్ ట్రంప్. ర్యాలీల్లో పాల్గొంటోన్నారు. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మోంటానా స్టేట్‌లోని బోజ్‌మన్‌లో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొనడానికి బయలుదేరిన ట్రంప్‌కు తృటిలో పెను ముప్పు తప్పింది. ఆయన ప్రయాణిస్తోన్న విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. బోజ్‌మన్ టౌన్‌ను సమీపించిన సమయంలో ఈ ఘటన సంభవించింది.
వెంటనే విమానాన్ని బిల్లింగ్స్ లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు. బోజ్‌మన్ టౌన్‌కు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎయిర్‌పోర్ట్. ఇక్కడ ట్రంప్ ఫ్లైట్ ల్యాండ్ అయిన విషయాన్ని ఎయిర్‌పోర్ట్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ జెన్నీ మోకెల్ నిర్ధారించారు. డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ప్రైవేట్ జెట్ ఫ్లైట్ బిల్లింగ్స్ లోగాన్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిందని వెల్లడించారు.












Click it and Unblock the Notifications