బిగ్ బాస్ గా ట్రంప్ ? అమెరికా పౌరసత్వం కోసం రియాల్టీ షో..! మరో షాకింగ్..!
రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక వలసదారులకు చుక్కలు చూపిస్తున్న డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు వారి ముందు మరో షాకింగ్ ఆఫర్ పెట్టబోతున్నారు. ముఖ్యంగా అమెరికా పౌరసత్వం కోరుకుంటున్న వలసదారులకు అందుకోసం ఓ సంచలన షరతు పెడుతున్నారు. అదే రియాల్టీ షో. ఈ షోలో పాల్గొని గెలిస్తే వలసదారులకు వారు కోరుకుంటున్న అమెరికా పౌరసత్వం ఇచ్చే ప్రతిపాదనను ట్రంప్ సర్కార్ సీరియస్ గా పరిశీలిస్తోంది.
అమెరికాలో ట్రంప్ సర్కార్ వలసదారుల్ని వెతికి వెతికి మరీ వారి స్వదేశాలకు పంపేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా పౌరసత్వం కోసం భారీగా డిమాండ్ ఉంది. దీన్ని కూడా క్యాష్ చేసుకోవాలని నిర్ణయించిన ట్రంప్.. ఇప్పుడు రియాల్టీ షోను తెరపైకి తెస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే రియాల్టీ షోలో గెలిస్తే ఇక అమెరికన్ పౌరసత్వం ఖాయం అనేలా ఈ షోను డిజైన్ చేస్తున్నారు. ఇందులో గెలిచిన వారికి కచ్చితంగా అమెరికా పౌరసత్వం లభించనుంది.

అమెరికా పౌరసత్వం కోసం ట్రంప్ సర్కార్ నిర్వహించే రియాల్టీ షో విధివిధానాలను ఖరారు చేసేందుకు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తీవ్ర కసరత్తు చేస్తోంది. తమ ప్రణాళిక ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ ఇందులో చాలా అంశాలు ఉంటాయని అధికారులు హింట్స్ ఇస్తున్నారు. ఇందుకోసం 'ది అమెరికన్' అనే థీమ్ ను రియాలిటీ టీవీల సీనియర్ యాంకర్, డక్ డైనాస్టీ , ది మిలియనీర్ మ్యాచ్ మేకర్ వంటి షోలకు ప్రసిద్ధి చెందిన రాబ్ వోర్సాఫ్ ప్రతిపాదించారు. స్వయంగా కెనడియన్ వలసదారుడైన వోర్సాఫ్ ఆలోచన ప్రకారం దీన్ని నిర్వహించేందుకు ట్రంప్ సర్కార్ సిద్దమవుతోంది.
అమెరికా పౌరుడిగా నిరూపించుకునే విధంగా ఈ రియాల్టీ షోను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కంటెస్టెంట్లు దేశవ్యాప్తంగా తిరిగి టాస్క్ లు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో బంగారు గనుల నుంచి బంగారం తీసుకురావడం వంటివి కూడా ఉంటాయని తెలుస్తోంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని గని నుండి బంగారాన్ని సేకరించడం లేదా ఏ వలసదారుడు ముందుగా రాకెట్‌ను సమీకరించగలరో చూడటం వంటి కార్యకలాపాలు ఈ రియాల్టీషోలో ఉంటాయని చెప్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
-
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
ఖమేనీ సంధి ఒప్పందం? -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్












Click it and Unblock the Notifications