అణుచర్చల్లో బిగ్ ట్విస్ట్-ఇరాన్ దెబ్బకు తోకముడిచిన ట్రంప్ ! అనూహ్య నిర్ణయం..!

ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకునేందుకు ఆ దేశంతో అమెరికా జరిపిన చర్చలు విఫలం కావడం పశ్చిమాసియాలో మరోసారి నిప్పుల కుంపటి రాజేసేలా కనిపిస్తోంది. ఇరాన్ తో జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో అర్ధాంతరంగా వెనక్కి తగ్గిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పైకి వేరే కారణం చెబుతున్నా పశ్చిమాసియా నుంచి బలగాల్ని వెనక్కి పిలిపిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం సంచలనం రేపుతోంది.

అమెరికాతో జరిగిన అణుచర్చలు విఫలమైన నేపథ్యంలో ఇరాన్ దీటుగా స్పందిస్తోంది. అణ్వస్త్ర కార్యక్రమాలు నిలిపేస్తే గతంలో విధించిన ఆంక్షలు ఎత్తేస్తామన్న హామీతో అమెరికాతో చర్చలు జరిపిన ఇరాన్ మరిన్ని హామీలు కోరింది. దీంతో అమెరికా వాటిని అంగీకరించకుండా చర్చల్ని ఆపేసి వెనక్కి తగ్గింది. దీంతో ఇరాన్ ఆగ్రహంగా ఉంది. చర్చలు విఫలమైన వేళ అమెరికా తమ బలగాలతో దాడులు చేస్తుందన్న భయాల్ని తోసిపుచ్చిన ఇరాన్.. తమతో పెట్టుకుంటే ప్రత్యర్థికి తమ కంటే ఎక్కువ నష్టం చేసి తీరుతామని హెచ్చరించింది.

Donald trump pull out US troops from middle east after iran s latest warning

ఈ హెచ్చరికలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ఆత్మరక్షణలో పడేశాయి. ఇప్పటికే పశ్చిమాసియా దేశాల్లో వివిధ కారణాలతో మోహరించిన తమ బలగాల్ని అక్కడే కొనసాగిస్తే ఇరాన్ దాడి చేసే అవకాశాలు ఉన్నాయన్న భయంతో వాటిని వెనక్కి పిలిపిస్తూ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా బలగాలు దాడులకు దిగితే వారి స్థావరాలు తమకు అందుబాటులోనే ఉన్నాయన్న విషయం గుర్తుంచుకోవాలన్న ఇరాన్ హెచ్చరిక ప్రభావంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అమెరికా బలగాలు పశ్చిమాసియా దేశాలైన బహ్రెయిన్, కువైట్ నుంచి వెనుదిరుగుతున్నాయి.

దీనిపై స్వయంగా ట్రంప్ ను మీడియా ప్రశ్నిస్తే ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లేవని, వాటిని సంపాదించుకునే అవకాశం ఆ దేశానికి ఇవ్వబోమని తేల్చేశారు. అటువంటప్పుడు పశ్చిమాసియా నుంచి బలగాల ఉపసంహరణ ఎందుకని ప్రశ్నిస్తే అమెరికా పౌరులకు తమ దేశంలోనే కాదు విదేశాల్లో సైతం భద్రత కల్పించాల్సిన బాధ్యత తమకు ఉందని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే ఇరాన్ తమ స్థావరాలపై దాడులు చేసి తమ బలగాలను మట్టుపెట్టే ప్రమాదం ఉందన్న భయంతోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్దమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+