కొట్టుకుంటే మీతో వ్యాపారం బంద్- భారత్, పాక్ కు ట్రంప్ తాజా వార్నింగ్..! అణుయుద్ధం ఆపా, లక్షల ప్రాణాలు కాపాడా..
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో బెంబేలెత్తిన పాకిస్తాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం కోరింది. ఈ నేపథ్యంలో స్పందించిన డొనాల్డ్ ట్రంప్.. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు సంధి కుదుర్చారు. దీంతో ఇరు దేశాల మధ్య కాల్పులు ఆగిపోయాయి. మిస్సైళ్లు, డ్రోన్లూ శాంతించాయి. సీజ్ ఫైర్ పై భారత్-పాక్ కంటే ముందే ప్రకటన చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇవాళ మరోసారి ఇదే అంశంపై స్పందించారు.
భారతదేశం-పాకిస్తాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ మరోసారి స్పందించారు తాము అణు సంఘర్షణను ఆపామని, అది చెడ్డ అణు యుద్ధం కూడా అయి ఉండవచ్చన్నారు. లక్షలాది మంది ప్రజలు ఈ యుద్ధంలో చనిపోయి ఉండవచ్చన్నారు. దాన్ని తాను అడ్డుకున్నట్లు తెలిపారు. దీనికి కృషి చేసిన తన ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు.

#WATCH | US President Donald Trump says, "...On Saturday, my administration helped broker an immediate ceasefire, I think a permanent one between India and Pakistan - the countries having a lot of nuclear weapons..."
— ANI (@ANI) May 12, 2025
(Source - White House/Youtube) pic.twitter.com/4q5LXFhtZ4
తాము పాకిస్తాన్‌తో చాలా వాణిజ్యం చేయబోతున్నామని, భారతదేశంతోనూ చాలా వాణిజ్యం చేయబోతున్నామని ట్రంప్ వెల్లడించారు. తాము ప్రస్తుతం భారతదేశంతో చర్చలు జరుపుతున్నామని, అలాగే త్వరలో పాకిస్తాన్‌తో కూడా చర్చలు జరపబోతున్నామని ట్రంప్ వెల్లడించారు. భారత్, పాక్ మధ్య తాము కాల్పుల విరమణ ఒప్పందం చేయించామని, ఇది శాశ్వతమని తాము భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య చాలా అణ్వాయుధాలు ఉన్నాయని, అయినా సమయస్పూర్తి పాటించిన ఇరుదేశాల నాయకత్వాలకు ట్రంప్ అభినందనలు తెలిపారు.
#WATCH | On India-Pakistan understanding, US President Donald Trump says, "...We stopped a nuclear conflict. I think it could have been a bad nuclear war. Millions of people could have been killed. I also want to thank VP JD Vance and Secretary of State, Marco Rubio, for their… pic.twitter.com/9upYIqKzd1
— ANI (@ANI) May 12, 2025
భారత్, పాక్ లతో ఇప్పటికే చాలా సాయం చేశామని, వాణిజ్యం రూపంలో కూడా సాయం చేశామని ట్రంప్ తెలిపారు. మీరు యుద్ధం ఆపితే ఇకపైనా వాణిజ్యం చేస్తామని ట్రంప్ ఆఫర్ చేశారు. యుద్ధం ఆపకపోతే మాత్రం ఇరు దేశాలతో వాణిజ్యం చేసేది లేదని ట్రంప్ తేల్చిచెప్పేశారు. వాణిజ్యం కోసమే ఇరు దేశాల మధ్య యుద్దం ఆపినట్లు ట్రంప్ చెప్పకనే చెప్పారు.












Click it and Unblock the Notifications