12 దేశాలకు ట్రంప్ బిగ్ షాక్ ? భారత్ సహా బ్రిక్స్ దేశాలకు 10 శాతం ఎక్స్ ట్రా..!

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి తమ ఆర్ధిక వ్యవస్థను చక్కబెట్టుకునే పేరుతో విదేశాలపై భారీ సుంకాలు విధిస్తూ బెదిరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ .. ఇదే క్రమంలో మరికొన్ని దేశాలకు షాకులు ఇచ్చేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు 12 దేశాలను ఎంపిక చేసుకుని వారికి ఇవాళ వేర్వేరు భారీ సుంకాలతో షాక్ ఇచ్చేందుకు ట్రంప్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయా దేశాలకు పంపే పత్రాలకు సంతకాలు కూడా చేసేశారు. ఆ సుంకాల రేట్లను ఇవాళ ప్రకటిస్తామన్నారు.

ట్రంప్ అధికారంలోకి రాగానే విదేశాలు తమ దేశ వస్తువులపై ఎంత సుంకం విధిస్తున్నాయో తానూ వారి వస్తువులపై అంతే సుంకం విధిస్తానంటూ హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్.. చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. 90 రోజుల పాటు సుంకాల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఆ గడువు ఎల్లుండితో ముగిసిపోనుంది. ఈ 90 రోజుల్లో తమతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటే సరే సరి లేకపోతే సుంకాల మోత తప్పదని హెచ్చరించారు. దీంతో పలు దేశాలు అమెరికాతో ఒప్పందాలు చేసుకున్నాయి.

Donald trump set to give tariff shocker to 12 countries today 10 percent threat to BRICS nations

అయితే భారత్ సహా పలు దేశాలు ఇంకా అమెరికాతో ఒప్పందాలు చేసుకోలేదు. అయితే అమెరికాలోనే ఉన్న భారత బృందం అక్కడి అధికారులతో వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతోంది. అయితే భారత్ విషయంలో గుర్రుగానే ఉన్న ట్రంప్.. పూర్తి స్దాయి ఒప్పందం కాకుండా మినీ ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో భారత్ తో పాటు పలు దేశాలపై మరో కారణంతో ట్రంప్ సుంకాల మోత మోగించేందుకు సిద్దమవుతున్నారు.

Take a Poll

12 దేశాలకు అదనపు సుంకాలు విధించే పత్రాలపై నిన్న సంతకాలు చేసిన ట్రంప్.. ఇవాళ వాటిని ఆయా దేశాలకు పంపుతానని ప్రకటించారు. అయితే ఇందులో ఏయే దేశాలు ఉన్నాయి, వాటిపై ఎంత మేర సుంకాలు విధించారన్న వివరాలను ఇవాళ బయటపెడతానని ప్రకటించారు. అదే సమయంలో భారత్, దక్షిణాఫ్రికా, రష్యా, చైనాతో కూడిన బ్రిక్స్ దేశాల కూటమిపై ట్రంప్ నిప్పులు చెరిగారు. ఈ కూటమిని అమెరికా వ్యతిరేక కూటమిగా ఆయన అభివర్ణించారు. ఈ కూటమిలో ఉన్న దేశాలపై అదనంగా 10 శాతం పన్ను విధిస్తామని ప్రకటించారు. దీంతో ఆయా దేశాలకు షాక్ తప్పడం లేదు. ట్రంప్ విధించే కొత్త సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి.

Donald trump set to give tariff shocker to 12 countries today 10 percent threat to BRICS nations

వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రిక్స్ దేశాల కూటమిలో ఇప్పుడు 10 దేశాలున్నాయి. ఇందులో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా , దక్షిణాఫ్రికా సహా ఇతర దేశాలున్నాయి. వీటిపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా పోస్ట్‌లో బ్రిక్స్ యొక్క అమెరికన్ వ్యతిరేక విధానాలకు అనుగుణంగా ఉన్న ఏ దేశమైనా అదనంగా 10 శాతం సుంకాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. ప్రపంచ వాణిజ్యంలో డాలర్ వినియోగాన్ని తగ్గించడం గురించి వారు అంతగా ఆలోచిస్తే బ్రిక్స్ దేశాలపై 100 శాతం సుంకం విధిస్తామని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+