న్యూజిలాండ్‌లో భారీ భూకంపం, 7.1 తీవ్రతతో ప్రకంపనాలు, సునామీ ముప్పు..?
ఈశాన్య న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.1గా నమోదైందని జియలాజిస్టులు తెలిపారు. కెర్మాడెక్ దీవు దక్షిణ ప్రాంతంలో భూమి కంపించిందని పేర్కొన్నారు. దీవిలో భూకంప తీవ్రత 10 కిలోమీటర్ల లోతు వరకు ప్రభావం చూపించిందన్నారు.

భూకంపంతో న్యూజిలాండ్‌లోని ఒపొటికి, వాటాఖనే, గిస్బోర్న్, తౌరంగ, రొటొర్గాపై ప్రభావం చూపించింది. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆందోళన నెలకొంది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టంపై క్లారిటీ రాలేదు. భూకంపంతో సునామీ వచ్చే అవకాశం లేదు అని అమెరికా జియలాజిస్టులు పేర్కొన్నారు. కానీ అమెరికా జియలాజిస్టులు మాత్రం భూంకప తీవ్రత 7.4గా ఉంది అని రిపోర్ట్ చేశాయి.












Click it and Unblock the Notifications