ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం: నెలలో మూడోసారి
Afghanistan earthquake 2025: పొరుగుదేశం ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఆ దేశ ఉత్తర ప్రాంతాన్ని వణికించింది. తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. సరిహద్దు ప్రాంతం కావడం వల్ల తజకిస్తాన్ లోనూ తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయి. దీనివల్ల ప్రాణ నష్టం చోటు చేసుకున్నట్లు సమాచారం లేదు.
ఆఫ్ఘనిస్తాన్ లో గత కొన్ని రోజుల్లో భూమి వరుసగా ప్రకంపిస్తూ వస్తోంది. ఆ దేశ ఉత్తరప్రాంతంలోనే ఇవి నమోదు అవుతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెల 2, 17వ తేదీల్లో కూడా 5.1, 4.9 తీవ్రతతో భూమి కంపించిందక్కడ. తాజా భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా రికార్డయింది.

బుధవారం రాత్రి 36.32 నార్త్ అక్షాంశం, 71.33 తూర్పు రేఖాంశం పరిధిలోకి వచ్చే ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర ప్రాంతం బఘ్లాన్ ప్రావిన్స్‌లో భూమి కంపించింది. ఉపరితలం నుంచి 138 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్‌లల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది.
దాదాపుగా 1,10,000 మందికి పైగా జనాభా ఉండే బాగ్లాన్ నగరానికి తూర్పున 164 కి.మీ దూరంలో ఉండే ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యూరోపియన్ మిడ్ టెర్రయిన్ సెస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. ఈ భూకంప తీవ్రత బఘ్లాన్ సిటీలో కనిపించింది.
ఈ రీజియన్ పరిధిలోని బహరక్, ఫైజాబాద్, దరియా-ఏ- పిష్కాన్.. వంటి పట్టణాలు, గ్రామాల్లో కొన్ని చోట్ల నివాసాలు బీటలు వారినట్లు సమాచారం అందింది. భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు.
పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్. తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి ఇక్కడ. హిందూ కుష్ రీజియన్ లో ఎక్కువ సార్లు భూమి ప్రకంపిస్తుంటుంది. కెనడా, అమెరికా, మెక్సికో, గ్వాటెమాలా, కోస్టారికా, చిలీ, పెరు, ఈక్వెడార్, కొలంబియా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఇండొనేసియా, పపువా న్యూగినియా, న్యూజిలాండ్.. రింగ్ ఆఫ్ ఫైర్ దేశాలు.












Click it and Unblock the Notifications