మళ్లీ ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్; బెర్నార్డ్ ఆర్నాల్డ్ వెనక్కు; టాప్ లో టెస్లాఅధినేత!!
ప్రపంచ కుబేరుల జాబితాలో మరోసారి నెంబర్ వన్ గా నిలిచారు టెస్లా, ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్. టెస్లా సిఈఓ ఎలాన్ మస్క్ మరోమారు ప్రపంచ అత్యంత సంపన్నుడిగా తన స్థానాన్ని తిరిగి సంపాదించారు. బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం టెస్లా సీఈవో యొక్క నికర విలువ ఇప్పుడు దాదాపు 192 బిలియన్ డాలర్లు. ఈ సంపదతో ప్రపంచంలో నెంబర్ వన్ గా ఎలాన్ మస్క్ నిలిచారు.
గతంలో నంబర్ వన్ స్థానంలో ఉన్న లగ్జరీ వ్యాపారవేత్త, ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ అయిన లూయిస్ విట్టన్ యొక్క సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్డ్ ను వెనక్కి నెట్టి ఎలన్ మస్క్ తన స్థానాన్ని తిరిగి దక్కించుకున్నారు. ప్రస్తుతం బెర్నార్డ్ ఆర్నాల్డ్ యొక్క యొక్క నికర విలువ 187 బిలియన్ డాలర్లు. బుధవారం నాడు ఎల్వీఎంహెచ్ షేర్లు 2.6% పడిపోవడంతో బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఆస్తుల నికర విలువ 186.6 బిలియన్ డాలర్లకు పడిపోయింది.

గత డిసెంబర్లో బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఎలాన్ మస్క్ ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మొదటి స్థానంలో నిలిచారు. విలాసవంతమైన వస్తువులను అమ్మకాలలో గణనీయమైన పురోగతి కారణంగా ఆర్నాల్డ్ సంపద పెరిగింది. దీంతో ఎల్వీఎంహెచ్ స్టాక్ ధర భారీగా పెరిగింది. దీంతో ఆయన మొదటి స్థానానికి రాగా, అప్పుడు మస్క్ రెండో స్థానానికి పడిపోయారు.
ఇక తాజాగా బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన వ్యక్తిగా తన స్థానాన్ని తిరిగి దక్కించుకున్నారు మస్క్. బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం బుధవారం నాటికి మార్కెట్లు ముగిసే సమయానికి ఎలాన్ మస్క్ నికర ఆస్తుల విలువ సుమారు 192 బిలియన్ డాలర్లుగా ఉందని వెల్లడించారు. ఇది బెర్నార్డ్ ఆర్నాల్డ్ యొక్క సంపదను అధిగమించింది.
దీంతో రియల్ టైంలో బ్లూమ్ బెర్గ్ ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో తిరిగి టాప్ వన్ పొజిషన్లో నిలిచారు ఎలాన్ మస్క్. గత సంవత్సరం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ అతిపెద్ద సంపద నష్టంతో ఎలాన్ మస్క్ తన మొదటి స్థానాన్ని కోల్పోయారు. గత సంవత్సరం వాల్ స్ట్రీట్ లో టెస్లాకు చెత్త సంవత్సరంగా మారింది. టెస్లా షేర్ల విలువ దారుణంగా క్షీణించడంతో ఊహించని నష్టం జరిగింది. అప్పుడు మొత్తం 700 బిలియన్ల డాలర్లను టెస్లా కోల్పోయింది.












Click it and Unblock the Notifications