ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్..!!
వాషింగ్టన్: ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ఎక్స్, ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన తరువాత ట్విట్టర్.. రోజూ వార్తల్లో ఉంటో వస్తోంది. ఏదో ఒక సంచలనానికి కేంద్రబిందువు అవుతోందీ టాప మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్. 44 బిలియన్ డాలర్లను చెల్లించి ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన అనంతరం- అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలో గల ప్రధాన కార్యాలయంలో సింక్‌ను చేతులతో పట్టుకుని అడుగుపెట్టినప్పటి నుంచీ ఎలాన్ మస్క్.. ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్నారు.

ఉద్యోగుల కోతతో మొదలు..
ఎలాన్ మస్క్ హయాంలో అల్లకల్లోలానికి గురవుతోంది. అతలాకుతలమౌతోంది. ఇన్ని సంవత్సరాల పాటు సజావుగా సాగుతూ వచ్చిన ఈ టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు కుదుపులకు లోనవుతోంది. రోజూ పెను సంచలనాలు నమోదవుతున్నాయి ఇందులో. ఒక దాని వెంట ఒకటిగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ట్విట్టర్‌లో పని చేసే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టారు ఎలాన్ మస్క్. దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోన్నప్పటికీ పట్టించుకోవట్లేదు. ఉద్యోగాల్లో కోత పెట్టారు. కొత్త ఉద్యోగాల నియామకాలను నిలిపివేశారు.
కార్యాలయాలు క్లోజ్..
ఇప్పటివరకు మూడువేల మందికి పైగా ఉద్యోగులను తొలగించారాయన. అక్కడి పని వాతావరణం, ఒత్తిడిని తట్టుకోలేక రాజీనామా పెట్టి వెళ్లినపోయిన వారూ చాలామందే ఉన్నారు. పని విధానాన్ని నిరసిస్తూ ట్విట్టర్ ఉద్యోగులు సామూహిక రాజీనామాలకు దిగారు. దీని దెబ్బకు భారత్ సహా పలు దేశాల్లో ట్విట్టర్ ఆఫీసులు మూత పడ్డాయి. మళ్లీ సోమవారం కార్యాలయాలన్నింటినీ పునరుద్ధరించనున్నట్లు తెలిపింది యాజమాన్యం.

కొత్త పాలసీ..
అదే సమయంలో ట్విట్టర్ కొత్త పాలసీని ప్రకటించారు ఎలాన్ మస్క్. నెగెటివ్/హేట్ స్పీచ్‌ను నియంత్రించారు. ట్విట్టర్ వినియోగదారులకు వాక్ స్వాతంత్ర్యం ఉందని, ఎలాంటి పోస్టులనైనా పెట్టొచ్చని పేర్కొన్న ఆయన నెగెటివ్ పోస్టులకు మాత్రం రీచ్ ఉండబోదని తేల్చి చెప్పారు. నెగెటివిటీ/హేట్ స్పీచ్ వంటి పోస్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమోట్ చేయబోమని స్పష్టం చేశారు. నెగెటివిటీని విస్తరింపజేసే పోస్టులను గుర్తించడానికి ప్రత్యేక వ్యవస్థ ఉందని చెప్పారు.
ట్రంప్ ట్విట్టర్ అకౌంట్‌పై..
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ను పునరుద్ధరించారు. ట్రంప్ ట్విట్టర్ అకౌంట్‌ను పాత యాజమాన్యం శాశ్వతంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. దీన్ని పునరుద్ధరించినట్లు ఎలాన్ మస్క్ కొద్ది సేపటి కిందటే ప్రకటించారు. దీనిపై తన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోల్ పోస్ట్‌ను పెట్టారు ఎలాన్ మస్క్. డొనాల్డ్ ట్రంప్ అకౌంట్‌ను పునరుద్ధరించాలా? వద్దా? అనే విషయంపై యూజర్ల నుంచి అభిప్రాయాలను సేకరించారు.

52 శాతం ఓకే..
మెజారిటీ యూజర్లు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్‌ను పునరుద్ధించడం వైపేమొగ్గు చూపారు. 51.8 శాతం మంది ట్రంప్‌కు అనుకూలంగా ఓటు వేశారు. దీన్ని వ్యతిరేకించిన వినియోగదారుల శాతం 48.2. మొత్తంగా 1,50,85,458 మంది వినియోగదారులు ఓ పోల్‌లో భాగస్వామ్యులు అయ్యారు. తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. మెజారిటీ యూజర్ల అభిప్రాయం మేరకు ట్రంప్ అకౌంట్‌ను పునరుద్ధరించారు మస్క్. realDonaldTrump అనే అకౌంట్ ఇప్పుడు ట్విట్టర్‌లో కనిపిస్తోంది. 24 గంటల పాటు జరిగిన ఆన్‌లైన్ ఓటింగ్ ఇది.

2021 జనవరిలో బ్లాక్..
కాగా- గతంలో వేటు పడిన క్యాథే గ్రిఫిన్, జోర్డాన్ పీటర్సన్, బాబిలోన్ బీ అకౌంట్లను పునరుద్ధరించినట్లు ఎలాన్ మస్క్ తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్‌ను పాత యాజమాన్యం శాశ్వతంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం 2022 జనవరి 6వ తేదీన ట్రంప్ మద్దతుదారులు, సానుభూతిపరులు ఆ దేశా పార్లమెంట్ భవనంపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు కారణం ట్రంప్ చేసిన ట్వీట్లే కారణమంటూ అప్పట్లో ఆయన అకౌంట్‌ను బ్లాక్ చేసింది. ఇప్పుడు దాన్ని పునరుద్ధరించారు ఎలాన్ మస్క్.












Click it and Unblock the Notifications