Roads on Moon: త్వరలో చంద్రుడిపై రోడ్లు ? శాస్త్రవేత్తల ప్రయత్నాలు..
తాజాగా భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో చంద్రయాన్ 3 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన నేపథ్యంలో చంద్రుడిపై పరిశోధనల్ని కొత్త పుంతలు తొక్కించేందుకు దేశాల మధ్య పోటీ పెరుగుతోంది. అదే సమయంలో చంద్రుడిపై మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేసుకుంటే ఈ పని మరింత సులువవుతుందని భావిస్తున్న శాస్త్రవేత్తలు.. అదే క్రమంలో అక్కడ రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
చంద్రుని ఉపరితలాన్ని మరింత నివాసయోగ్యంగా, నౌకాయానంగా మార్చే ప్రయత్నంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA ప్రస్తుతం తలమునలై ఉంది. చంద్రునిపై రహదారుల నిర్మాణానికి తగిన ఉపరితలాలను రూపొందించడానికి ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను తాజాగా ప్రారంభించింది. PAVER పేరుతో ఇందుకోసం ఓ ప్రాజెక్టును రూపొందిస్తోంది. చంద్రుడిపై ధూళిని ఎదుర్కొంటుూ అక్కడ భవిష్యత్తులో సునాయాసంగా ప్రయోగాలు చేసేందుకు ఈ ప్రాజెక్టు దారులు తెరవబోతోంది.

ప్రస్తుతం చంద్రుడిపై ఉన్న ధూళి అక్కడ ప్రయోగాలకు తీవ్ర అవరోధంగా ఉంది. దీనికి పరిష్కారం కనుగొంటే ప్రయోగాలు చాలా సులువుగా చేయొచ్చని భావిస్తున్న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ.. ఇందులో భాగంగా పేవర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. గతంలో అపోలో ప్రయోగం చేసినప్పుడు దాని లూనార్ రోవర్ లో ఫెండర్ ఈ ధూళితో కప్పబడిపోయింది. తద్వారా అది వేడెక్కి ఫెయిలైంది. అలాగే సోవియట్ యూనియన్ లునోఖోడ్ 2 రోవర్ రేడియేటర్ కూడా దుమ్ముతో కప్పబడినప్పుడు వేడెక్కడం వల్ల పనిచేయకుండా పోయింది.
జర్మనీకి చెందిన బీఏఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్స్ రీసెర్చ్ అండ్ టెస్టింగ్, ఆలెన్ యూనివర్శిటీ, ఆస్ట్రియాలోని లిక్విఫెర్ సిస్టమ్స్ గ్రూప్, జర్మనీకి చెందిన క్లాస్టల్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ నేతృత్వంలో ఇప్పుడు పేవర్ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ఈ బృందం 12-కిలోవాట్ కార్బన్ డయాక్సైడ్ లేజర్‌ను ఉపయోగించి చంద్రుడిపై ధూళిని ఘన ఉపరితలంగా కరిగించి, సాఫీగా ఉపరితలాన్ని నిర్మించేందుకు ఉపయోగపడనుంది.

ఈ ప్రక్రియలో త్రిభుజాకార, బోలు కేంద్రీకృత రేఖాగణిత ఆకృతులను దాదాపు 20 సెం.మీ మేర తయారు చేస్తారు. ఈ ఆకారాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి చంద్రుడి ధూళి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఘన ఉపరితలాలను నిర్మించడానికి, రోడ్లు లేదా ల్యాండింగ్ ప్యాడ్‌లుగా మార్చడానికి పనికొస్తాయి. ఫలితంగా వచ్చే పదార్థం గాజులాగా, పెళుసుగా ఉంటుంది కానీ క్రిందికి కుంగిపోకుండా తట్టుకోగలదు. అది విరిగిపోయినప్పటికీ దానిని వాడుకోవచ్చని, అవసరమైనప్పుడు మరమ్మతులు కూడా చేయవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఇలా 100 చదరపు మీటర్ల ల్యాండింగ్ ప్యాడ్ రెండు సెంటీమీటర్ల మందంతో 115 రోజుల్లో నిర్మించబడుతుందని సైంటిస్టుల బృందం అంచనా వేసింది. ఈ ప్రాజెక్ట్ ఓపెన్ స్పేస్ ఇన్నోవేషన్ ప్లాట్‌ఫారమ్ OSIP ద్వారా ESA బేసిక్ యాక్టివిటీస్ డిస్కవరీ ఎలిమెంట్ ద్వారా వచ్చిన ఆలోచలతో రూపుదిద్దుకుంది. వ్యోమగాములు చంద్రుని ఉపరితలంపైకి తిరిగి రావడానికి సిద్ధమవుతున్నప్పుడు, రహదారి యోగ్యమైన ఉపరితలాల సృష్టి చంద్రుని అన్వేషణను సురక్షితంగా, మరింత సమర్థవంతంగా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని అంచనా వేస్తున్నారు.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications