EX Wife: నెట్ లో మాజీ భార్య వీడియో చూసి 700 కిలోమీటర్లు వెళ్లి లేపేశాడు, పరువు !
చికాగో/అమెరికా/పాకిస్తాన్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా జీవించాలని అనుకున్నారు. భర్త ప్రముఖ వ్యాపారవేత్త. పుట్టిన దేశం అంటే అతనికి ఎక్కువ గౌరవం. అతని మతం మీద విపరీతమైన ప్రేమ ఉన్న భర్త కొన్ని కట్టుబాట్లు పాటిస్తున్నాడు. భార్య మార్డ్నన్ గా ఉండాలని, స్వచ్చగా బతకాలని అనుకుంది. దంపతుల మద్య తేడాలు రావడంతో ఏడాదిలోనే విడిపోయారు. మాజీ భార్య వీడియో సోషల్ మీడియాలో చూసిన ఆమె మాజీ భర్త రగిలిపోయాడు. అప్పటికే భార్య మీద పగతో రగిలిపోతున్న భర్త ఆవేశంతో ఊగిపోయాడు. 700 కిలోమీటర్లు స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లిన వ్యాపారి అతని మాజీ భార్యను రివాల్వర్ తో కాల్చి చంపేయడం కలకలం రేపింది.

ప్రముఖ వ్యాపారి
పాకిస్తాన్ కు చెందిన రహిల్ అహమ్మద్ (36) అనే యువకుడు అమెరికా చేరుకుని జార్జియాలో నివాసం ఉంటున్నాడు. పుట్టిన దేశం పాకిస్తాన్ అంటే రహీల్ అహమ్మద్ కు ఎక్కువ గౌరవం. ఇస్లాం మతం మీద విపరీతమైన ప్రేమ ఉన్న రహిల్ అహమ్మద్ ఇప్లాంలోని కట్టుబాట్లు పాటిస్తున్నాడు. అమెరికాలో వ్యాపారం చేస్తున్నా పాకిస్తాన్ అంటే రహీల్ ప్రాణం ఇస్తున్నాడని తెలిసింది.

గత ఏడాది పెళ్లి
పాకిస్తాన్ కు చెందిన సానియా ఖాన్ (29) అనే యువతిని గత ఏడాది వ్యాపారి రహీల్ మోహమ్మద్ పెళ్లి చేసుకున్నాడు. సానియా ఖాన్ టిక్ టాకర్, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ రావడంతో మార్డ్నన్ గా ఉండాలని, స్వచ్చగా బతకాలని అనుకుంది. గత ఏడాదిలో రహీల్ మోహమ్మద్, సానియా ఖాన్ వివాహం చేసుకుని సంతోషంగా జీవించాలని అనుకున్నారు.

పెళ్లి పెటాకులు అయ్యింది
భర్త రహీల్ కు ఇస్లాం మతం అంటే ఎక్కువ గౌరవం ఉంటే అతని భార్య సానియా ఖాన్ మాత్రం అతని ఇష్టాలకు వ్యతిరేకంగా బతకడం మొదలుపెట్టింది. ఇదే విషయంలో రహీల్ మోహమ్మద్, సానియా ఖాన్ ల మద్య గొడవలు జరిగాయి. కలిసిజీవించలేమని తెలుసుకున్న రహీల్, సానియా ఖాన్ ఇదే ఏడాది మే నెలలో విడాకులు తీసుకుని అమెరికాలోనే వేర్వేరు ప్రాంతాల్లో జీవిస్తున్నారు.

మాజీ భార్య వీడియో చూసి రగిలిపోయిన వ్యాపారి
ఇటీవల సానియా ఖాన్ ఓ టిక్ టాక్ వీడియో తీసి పోస్టు చేసింది. ఇస్లాం మతం అంటే గౌరవించాలని, అయితే ఆ నియమాలు పాటిస్తూ మనసు చంపుకుని కాపురం చెయ్యాలంటే కొందరు మహిళలకు సాధ్యం కాదని, మహిళలు బయటపడి అలాంటి విషయాలు బయటకు చెప్పడం లేదని వీడియోలు చెప్పింది.

మాజీ భార్యను కాల్చి చంపేసి ఆత్మహత్య
మాజీ భార్య సానియా ఖాన్ టిక్ టాక్ వీడియో చూసిన రహీల్ రగిలిపోయాడు. జార్జియా నుంచి 700 కిలోమీటర్ల దూరంలోన్న మాజీ భార్య సానియా ఖాన్ ఇంటి దగ్గరకు స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లాడు. ఇంట్లో మాజీ భార్య సానియా ఖాన్ తో గొడవపెట్టుకున్న రహీల్ వెంటతీసుకెళ్లిన రివాల్వర్ తీసుకుని మాజీ భార్య సానియా ఖాన్ మీద కాల్పులు జరిపాడు. తరువాత మాజీ భార్య సానియా ఖాన్ ఇంటిలోనే రహీల్ కూడా రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications