ఫేస్బుక్లో ఇక వీడియో ద్వారా విష్ చేయొచ్చు
న్యూయార్క్: సామాజిక అనుసంధాన వేదిక ఫేస్బుక్ మరో ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. రోజూ ఫేస్బుక్ ఖాతా తెరవగానే స్నేహితుల్లో ఎవరెవరి పుట్టినరోజులున్నాయో ఎలర్ట్స్ చూసి.. వారందరి టైమ్‌లైన్‌పై ఓ పుట్టినరోజు శుభాకాంక్షల సందేశం పెట్టేయడం మనందరం చేసేదే.
అయితే, ఇందుకు భిన్నంగా ఇప్పుడు ఫేస్బుక్ కొత్తగా వీడియోతో జన్మదిన శుభాకాంక్షలు చెప్పే సదుపాయం కల్పిస్తోంది. ‘బర్త్‌డే వీడియో కామ్' ఫీచర్‌ను ఫేస్బుక్ కొత్తగా ప్రవేశపెడుతోంది. దీని ద్వారా స్నేహితులకు 15 సెకన్ల వీడియో సందేశం పంపొచ్చు.

కేవలం హ్యాపీ బర్త్‌డే అని టైప్ చేసి శుభాకాంక్షలు తెలపడమే కాకుండా.. ఇప్పుడు వీడియో ద్వారా ఇంటరాక్టివ్‌గా శుభాకాంక్షలు చేప్పే వీలు కలుగనుంది.
ప్రస్తుతం దీనిని ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ప్రారంభిస్తున్నట్లు ‘టెక్‌క్రంచ్' వెల్లడించింది. త్వరలోనే ఆండ్రాయిడ్, తదితర ఓఎస్‌లలో ప్రవేశపెట్టేందుకు ఫేస్బుక్ ప్రయత్నాలు ప్రారంభించింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications