ఐఎస్ఐఎస్: పెళ్లి చేసుకుని ఉగ్రవాదులయ్యారు
వాషింగ్టన్: అమెరికాలో కాల్పులు జరిపి 14 మందిని అంతం చేసిన రిజ్వాన్ ఫారూక్ (28), తప్పీన్ మాలిక్ (27) అనే ఇద్దరూ వివాహం చేసుకున్నారని అధికారులు అంటున్నారు. వీరికి ఆరు నెలల కుమార్తె ఉందని అమెరికా అధికారులు తెలిపారు.
వీరిద్దరూ తమ ఆరు నెలల కుమార్తెను ఫారూక్ తల్లి దగ్గర వదిలి పెట్టారు. ఆసుపత్రికి వెళ్లి వస్తామని చెప్పి బయలుదేరి కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినో ప్రాంతంలో కాల్పులు జరిపారని దర్యాప్తు చేస్తున్న అధికారుల విచారణలో వెలుగు చూసింది.
తాము తిరిగిరామని వీరికి ముందే తెలుసు, అందుకే పాపను ఫారూక్ తల్లికి అప్పగించారని అధికారులు అన్నారు. భద్రతా దళాలు జరిపిన కాల్పులలో ఫారూక్, తప్పీన్ మాలిక్ అంతం అయ్యారు. ఫారూక్ అమెరికా పౌరుడు.

పాకిస్థాన్ కు చెందిన తప్పీన్ మాలిక్ 18 సంవత్సరాల వయస్సులో సౌదీ అరేబియా వెళ్లి అక్కడే ఉండేది. తప్పీన్ గురించి ఫారూక్ ఆన్ లైన్ డేటింగ్ సర్వీస్ ద్వార వివరాలు తెలుసుకున్నాడు. సౌదీ వెళ్లిన సమయంలో ఆమెను కలుసుకున్నాడు.
తరువాత ఇద్దరూ ఇష్టపడి వివాహం చేసుకున్నారని ఫారూక్ తల్లి పోలీసులకు చెప్పారు. ఫారూక్, తప్పీన్ మాలిక్ వివాహం చేసుకున్నారని వారి కుటుంబ లాయర్ మహమ్మద్ స్పష్టం చేశారు. ఫారూక్ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులతో సోషల్ మీడియాలో సంప్రదించాడు.
ఈ విషయాలను అధికారులు బయటకులాగారు. అయితే దాడుల వెనుక ఉన్న కారణం మాత్రం ఇప్పటి వరకు తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఫారూక్ తో పాటు అమెరికాలో ఇంకా ఎవరితోనైనా సంబంధాలు పెట్టుకున్నారా అని ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications