డోనాల్డ్ ట్రంప్ కు షాకిచ్చిన దర్శకులు

లాస్ ఏంజిల్స్: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా డాక్యుమెంటరీ సినిమాల దర్శకులు పలు ప్రకటనలు రూపొందించి ప్రచారం మొదలుపెట్టారు.

టీవీల్లో డోనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా ప్రకటనలు రూపొందించి ఇవ్వడానికి ఈ దర్శకులు ముందుకు వచ్చారు. ట్రంప్ కు వ్యతిరేకంగా మొదటి ప్రకటనను ప్రముఖ దర్శకుడు రాచేల్ గ్రేయ్ రూపొందించారు.

ఈ ప్రకటనలో ఓ రిపబ్లికన్ మహిళా కార్యకర్త మాట్లాడుతూ తాను కచ్చితంగా డోనాల్డ్ ట్రంప్ కు ఓటు వెయ్యనని తేల్చి చెప్పారు. ఓహిలోని బట్లర్ కౌంటీలోని 11 స్థానిక కేబుల్ చానెళ్లలో ట్రంప్ కు వ్యతిరేకంగా రూపొందించిన ప్రకటనలు ప్రసారం కానున్నాయి.

Filmmakers launch anti- Trump ad campaign

ఈ ప్రకటనలకు డెమొక్రటిక్ నేత లీ హిర్జ్ స్థాపించిన లోకల్ వాయిస్ సంస్థ స్పాన్సర్ చేస్తున్నది. అమిర్ బార్ లెవ్, అమీ బెర్గ్, హీదీ ఎవింగ్, మార్షల్ కర్రీ, రాచెల్ గ్రేడీ, గ్యాబ్రియల్ లాన్సన్, క్రిస్టీ జాకబ్ సన్, టైలర్ మీసోమ్, రోజర్ రోస్, డయానా వైటెన్ తదితర డాక్యూమెంటరీ రూపకర్తలు ట్రంప్ కు వ్యతిరేకంగా ప్రకటనలు రూపొందించడానికి ముందుకు వచ్చారు.

ఈ డాక్యూమెంటరీ రూపకర్తలు ట్రంప్ కు వ్యతిరేకంగా రూపొందుతున్న ప్రకటనలో పాలు పంచుకోవడానికి సిద్దం అయ్యారు. ట్రంప్ కు వ్యతిరేకంగా రూపొందుతున్న ప్రకటనలు పలు రాష్ట్రాల్లో ప్రసారం కానున్నాయి.

75 వేల డాలర్లు విరాళాలుగా సేకరించి రూపొందించిన ఈ ప్రకటనలు ఓహి రాష్ట్రంతో పాటు ఫ్లోరిడా, నార్త్ కరోలినా, పెన్సెల్వేనియా, అరిజోనా, ఉటా, జార్జియా తదితర రాష్ట్రాల్లో టీవీ చానెళ్లలో ప్రసారం చెయ్యాలని నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+