Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని అరెస్ట్: హైకోర్టులో.. రేంజర్ల అదుపులో

ఇస్లామాబాద్: పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ అధినేత, మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. రాజధాని ఇస్లామాబాద్‌లో కొద్దిసేపటి కిందటే అరెస్ట్ అయ్యారు. ఇస్లామాబాద్ హైకోర్టు ఆవరణలో ఆ దేశ రేంజర్లు ఇమ్రాన్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఉదంతంతో ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న పీటీఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

ఇదివరకు పనామా పేపర్ల కుంభకోణంలో మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయన తరువాత ఆ స్థాయి నాయకుడు అరెస్ట్ కావడం ఇదే తొలిసారి. అల్-ఖదిర్ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ చేసిన వెంటనే ఆయనను పాక్ రేంజర్లు డబుల్ క్యాబిన్ వెహికల్‌లో కేంద్ర కారాగారానికి తరలించినట్లు అక్కడి మీడియా పేర్కొంది.

Former Pakistan PM Imran Khan has been arrested by Rangers in Islamabad

అల్-ఖదిర్ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్ ఖాన్ పలుమార్లు అరెస్ట్ నుంచి బయటపడగలిగారు. గతంలో ఆయనను అరెస్ట్ చేయడానికి లాహోర్‌లోని నివాసానికి వెళ్లగా.. పీటీఐ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడ్డారు అప్పట్లో. పలు కేసుల్లో ఆయనపై ఎఫ్ఐఆర్‌ నమోదయ్యాయి. ఇదివరకు ఇమ్రాన్ ఖాన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్లు కూడా రద్దయ్యాయి.

అల్- ఖదిర్ ట్రస్ట్ కేసులో కూడా ముందస్తు బెయిల్ కోసం ఇమ్రాన్ ఖాన్ పిటీషన్‌ను దాఖలు చేసినప్పటికీ- ఇస్లామాబాద్ హైకోర్టు వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. అరెస్ట్‌కు ఆదేశాలు ఇచ్చింది. దీనితో హైకోర్టు ఆవరణలోనే ఆయనను రేంజర్లు అరెస్ట్ చేశారు. పారా మిలటరీ బలగాల కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయనను తరలించారు.

పీటీఐ నాయకులు, కార్యకర్తలు వాహనంపై దాడి చేసే అవకాశం ఉండటంతో దారి పొడవునా పెద్ద ఎత్తున భద్రత బలగాలను మోహరింపజేశారు. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌ను ఇస్లామాబాద్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ డాక్టర్ అక్బర్ నాసిర్ ఖాన్ ధృవీకరించారు. అల్- ఖదిర్ ట్రస్ట్ కేసులో అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఆయనను అదుపులోకి తీసుకున్నామని ప్రకటించారు.

గతంలో ఆయనను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు పెద్ద ఎత్తున హింస చెలరేగిన విషయం తెలిసిందే. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పోలీసులు, భద్రత సిబ్బందితో గొడవకు దిగారు. రాళ్లు రువ్వారు. దాడులకు పాల్పడ్డారు. లాహోర్‌లో ఇమ్రాన్ ఖాన్ నివాసం ఉన్న జమాన్ పార్క్‌తో పాటు నగరవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఇప్పుడు తాజాగా అరెస్ట్ నుంచి తప్పించుకోలేకపోయారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+