ట్రంప్ నెత్తిన ‘ప్లేబాయ్ మోడల్’ పిడుగు! వెలుగులోకి అధ్యక్షులవారి మరో రాసలీల..

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడి నెత్తిన మరో పిడుగు పడింది. ఆయనతో తనకు లైంగిక సంబంధం ఉందని ఆరోపిస్తూ మరో మహిళ మీడియా ముందుకొచ్చింది. ప్లేబాయ్ మాజీ మోడల్ అయిన కరెన్ మెక్‌డౌగల్(46) ట్రంప్‌తో తనకు శారీరక సంబంధం ఉన్నట్లు ఆరోపించింది.

చదవండి: ట్రంప్ మరో శ‌ృంగారలీల! పోర్న్‌స్టార్‌తో లైంగిక సంబంధం? ఆమె నోరు తెరవకుండా...

చదవండి: పోర్న్‌స్టార్ ఎఫెక్ట్: ట్రంప్ సంసారంలో నిప్పులు.. హోటల్‌కు వెళ్లిపోయిన మెలానియా!

ఇప్పటికే పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్‌తో ట్రంప్ రాసలీలలు నెరపారని, 2016లో అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె ఎక్కడ నోరు విప్పుతుందోని భయపడి ఆ 'సంబంధాన్ని' లక్షా 30 వేల డాలర్లతో తెంచేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కరెన్ మెక్‌డౌగల్‌తో ట్రంప్ అఫైర్‌ గురించి న్యూయార్కర్ అనే పత్రిక తాజాగా ఒక కథనాన్ని ప్రచురించింది.

 ప్లేబాయ్ మోడల్‌తో...

ప్లేబాయ్ మోడల్‌తో...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన మరో శృంగార లీల బయటికొచ్చింది. ఆయనతో తనకు శారీరక సంబంధం ఉన్నట్లు ఈసారి ఓ ప్లేబాయ్ మాజీ మోడల్ ఆరోపించింది. ఆమె పేరు కరెన్ మెక్‌డౌగల్. అయితే కరెన్ ఆరోపణలను గతంలోనే ట్రంప్ ఖండించారు.

 మెలానియా గర్భవతిగా ఉన్నప్పుడే...

మెలానియా గర్భవతిగా ఉన్నప్పుడే...

2006 లో మెలానియా గర్భవతిగా ఉన్న సమయంలో ట్రంప్ కరెన్ మెక్‌డౌగల్‌తో సీక్రెట్ అఫైర్ కొనసాగించాడట. తొమ్మిది నెలలపాటు వీరి బంధం కొనసాగిందట. తాజాగా న్యూయార్కర్ అనే పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ కరెన్ ఈ విషయాన్ని వెల్లడించింది.

 మరో 20 వేల డార్లు ఎక్కువిచ్చి...

మరో 20 వేల డార్లు ఎక్కువిచ్చి...

పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్‌కు ఎలాగైతే డబ్బిచ్చి ఆమెతో ఉన్న సంబంధాన్ని వదిలించేసుకున్నారో అదేమాదిరిగానే మెక్‌డౌగల్‌తోనూ ట్రంప్ వ్యవహరించారట. తమ మధ్య ఉన్న లైంగిక సంబంధాన్ని బయటపెట్టుకుండా ఉండేందుకు మరో 20 వేల డాలర్లు ఎక్కువ.. అంటే మొత్తం లక్షా 30 వేల డాలర్లు ముట్టజెప్పారట.

ఓసారి బెవర్లీ హిల్స్ హోటల్‌లో...

ఓసారి బెవర్లీ హిల్స్ హోటల్‌లో...

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు తనకు ఉన్న శ‌ృంగార సంబంధం గురించి మోడల్ మెక్ ‌డౌగల్ స్వయంగా వివరిస్తూ ఓ 8 పేజీల నోట్‌ను న్యూయార్కర్ పత్రికకు అందజేసిందట. ఓసారి బెవర్లీ హిల్స్ హోటల్‌లో ఆమెతో సెక్స్‌లో పాల్గొన్న తరువాత ట్రంప్ కరెన్‌కు కొంత డబ్బు కూడా ఇవ్వబోయారట. అంతేకాదు, తనతో ఉన్న అఫైర్‌కు సంబంధించి ఎక్కడా బయటపడకుండా ట్రంప్ పలు జాగ్రత్తలు తీసుకున్నారని ఆమె పేర్కొన్నట్లు న్యూయార్కర్ తన తాజా కథనంలో పేర్కొంది.

అబ్బే.. ఆ ఆరోపణల్లో నిజం లేదు...

అబ్బే.. ఆ ఆరోపణల్లో నిజం లేదు...

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకున్న లైంగిక సంబంధం గురించి ప్లేబాయ్ మాజీ మోడల్ కరెన్ మెక్ ‌డౌగల్ చేసిన ఆరోపణలను శ్వేతసౌధం ఖండించింది. ఇదంతా పాత కథేనంటూ కొట్టిపారేసింది. ఆమె ఆరోపణలలో ఎంత మాత్రం నిజం లేదని, తమ అధ్యక్షుడు అసలు ఆ మోడల్‌తో గడపనేలేదని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+