Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గ్యాస్ మాస్క్‌లో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తన నివాసం నుంచి బయటికి వచ్చారు. ముఖానికి గ్యాస్ మాస్క్ ధరించి తన పార్టీ కార్యకర్తలను కలుసుకున్నారు.

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేయడానికి పోలీసులు, భద్రత సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అరెస్ట్ చేయడానికి లాహోర్ జమాన్ పార్క్ లోని ఆయన నివాసానికి వచ్చిన పోలీసులను పాకిస్తాన్-ఇ-తెహ్రీక్ నాయకులు, కార్యకర్తలు అడ్డుపడ్డారు. పోలీసులు, భద్రత సిబ్బందితో ఘర్షణకు దిగారు. రాళ్లు రువ్వారు. వారిపై దాడులకు పాల్పడటానికీ వెనుకాడలేదు. ఈ ఘర్షణల్లో ఇస్లామాబాద్ డిప్యూటీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ షెహజాద్ బుఖారి గాయపడ్డారు.

పీటీఐ కార్యకర్తల ప్రతిఘటన..

మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పార్టీ.. పాకిస్తాన్-ఇ-తెహ్రీక్. ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేయడానికి పోలీసులు లాహోర్ లోని ఆయన నివాసానికి చేరుకోవడంతో పీటీఐ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. తీవ్రంగా ప్రతిఘటించారు. ఫలితంగా ఆయన నివాసం ఉన్న జమాన్ పార్క్ తో పాటు నగర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు, భద్రత బలగాలను వారు అడుగడుగునా అడ్డుకున్నారు. ఆయన ఇంటికి వెళ్లే మార్గాలన్నింటినీ మూసివేశారు. రోడ్లపై బైఠాయించారు.

పోలీసులతో బాహాబాహి..

పీటీఐ కార్యకర్తలు భారీగా గుమికూడారు. పోలీసు వాహనాలను ముందుకు కదలనివ్వలేదు. ఆయన ఇంటికి చేరడానికి పోలీసులకు కష్టమైంది. పీటీఐ కార్యకర్తలను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. కొన్ని చోట్ల గాల్లోకి కాల్పులు జరిపినట్లు వార్తలు అందాయి. అయినప్పటికీ- వారు ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. తమ దాడులను మరింత తీవ్రతరం చేశారు. చేతికి అందిన వస్తువులన్నింటినీ పోలీసులపైకి విసిరివేశారు.

అరెస్ట్ తాత్కాలిక నిలుపుదల..

అరెస్ట్ తాత్కాలిక నిలుపుదల..

ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది లాహోర్ న్యాయస్థానం. గురువారం ఉదయం 10 గంటల వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది. దీనితో పోలీసులు, భద్రత సిబ్బంది వెనుదిరిగారు. ఆయన నివాసం ఉన్న జమాన్ పార్క్ లో ప్రస్తుతం పోలీసులు గానీ, భద్రత సిబ్బంది గానీ ఒక్కరూ కనిపించలేదు. లాహోర్ కోర్టు ఇచ్చిన గడువు ముగిసిన తరువాత పరిస్థితి ఎలా మారుతుందనేది ఉత్కంఠతను రేపుతోంది.

గ్యాస్ మాస్క్..

గ్యాస్ మాస్క్..

పోలీసులు, భద్రత సిబ్బంది జమాన్ పార్క్ నుంచి వెళ్లిపోయిన నేపథ్యంలో- ఇమ్రాన్ ఖాన్ బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టారు. పీటీఐ నాయకులు, కార్యకర్తలను కలుసుకున్నారు. వారితో చాలాసేపు మాట్లాడారు. వారితో ఉల్లాసంగం మాట్లాడారు. ఆ సమయంలో ఇమ్రాన్ ఖాన్.. ముఖానికి గ్యాస్ మాస్క్ ధరించి కనిపించారు. ముందుజాగ్రత్తచర్యగా ఆయన ఈ గ్యాస్ మాస్క్ ధరించి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

వీడియో సందేశంలో..

తనను అరెస్ట్ చేయడం ఖాయమంటూ తెలిసిన వెంటనే ఇమ్రాన్ ఖాన్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పోలీసులు తనను బంధించడానికి వచ్చారని, తనను జైలులో పెట్టినా, ప్రాణం తీసినా హక్కుల కోసం పోరాడాలని ఆయన పీటీఐ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అల్లా తనకు అన్నీ ఇచ్చారని, తాను న్యాయం కోసం పోరాడుతున్నానని పేర్కొన్నారు. తన జీవితం అంతా పాకిస్తాన్ ప్రజల కోసమే ధారపోశానని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+