ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ కోఫీ అన్నన్ కన్నుమూత

న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి(యూనైటెడ్ నేషన్స్) మాజీ సెక్రటరీ జనరల్‌, నోబెల్‌ శాంతి బహుమతి పురస్కార గ్రహీత కోఫీ అన్నన్‌(80) కన్నుమూశారు. ఆఫ్రికా ఖండం నుంచి ఐక్యరాజ్యసమితికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తొలి నల్లజాతీయుడు ఆయనే.

జనవరి 1, 1997 నుంచి డిసెంబరు 31, 2006 వరకూ పదేళ్ళపాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఘనాలోని కుమాసిలో జన్మించిన అన్నన్‌ అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1961లో డిగ్రీ, 1972లో మేనేజ్‌మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు.

Former UN Secretary General Kofi Annan no more

1962లో బడ్జెట్ అధికారిగా అన్నన్ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించారు. 1987-92 కాలంలో సహాయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1997లో తొలిసారి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బౌత్రోస్ బౌత్రోస్‌ ఘలీ నుంచి బాధ్యతలు స్వీకరించారు. కోఫీ అన్నన్ మృతి ప్రపంచ దేశాధినేతలు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+