బిల్ క్లింటన్ ఆరోగ్యం విషమం?
Bill Clinton health: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన వయస్సు 78 సంవత్సరాలు. తీవ్ర జ్వరం, మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. దీనితో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. అత్యాధునిక చికిత్స తీసుకుంటోన్నారు.
ఈ విషయాన్ని బిల్ క్లింటన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఏంజెల్ యురేనా వెల్లడించారు. ప్రస్తుతం బిల్ క్లింటన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు. త్వరలోనే కోలుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. డాక్టర్లు అందిస్తోన్న చికిత్సకు ఆయన స్పందిస్తోన్నారని, ఆత్మ స్థైర్యంతో ఉన్నారని పేర్కొన్నారు.

1993 నుంచి 2001 వరకు అమెరికా అధ్యక్షుడిగా పని చేశారు బిల్ క్లింటన్. డెమోక్రటిక్ పార్టీ నాయకుడాయన. ఈ ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల సమయంలో చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ గెలుపు కోసం హిల్లరీ క్లింటన్‌తో కలిసి విస్తృతంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అధ్యక్ష పీఠం నుంచి దిగిన తరువాత తరచూ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ వస్తోన్నారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడ్డారు. పలుమార్లు సర్జరీ చేసుకున్నారు. 2004లో నాలుగుసార్లు బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. 2005లో కాలేయానికి శస్త్ర చికిత్స జరిగింది. 2010లో స్టంట్లు వేశారు.
ఫలితంగా వెగాన్‌గా మారారాయన. పూర్తిగా శాకాహారాన్ని స్వీకరిస్తూ వస్తోన్నారు. ఫలితంగా శరీర బరువును కోల్పోవాల్సి వచ్చింది. దీనివల్లా కొన్ని రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొనాల్సొచ్చింది. తాజాగా జ్వరం తీవ్రం కావడంతో రాజధాని వాషింగ్టన్ డీసీలోని మెడ్‌స్టార్ జార్జ్‌టౌన్ యూనివర్శిటీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.
భారత్‌లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. 2000లో పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అదే ఏడాది మార్చిలో హైదరాబాద్‌నూ సందర్శించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆహ్వానం మేరకు నగరాన్ని సందర్శించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
-
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఇరాన్‌తో పోరు.. ఆరు రోజుల్లో రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిన అమెరికా !! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్












Click it and Unblock the Notifications