Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Free Sri lanka Visa : శ్రీలంక వెళ్లాలనుకుంటున్నారా-టూరిస్ట్ వీసా ఫ్రీ..

గతేడాది తలెత్తిన ఆర్దిక సంక్షోభంతో కుదేలైన ద్వీప దేశం శ్రీలంక దాని నుంచి బయట పడేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా శ్రీలంక ఆర్దిక వ్యవస్ధకు కీలకమైన పర్యాటకాన్ని భారీ ఎత్తున ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పొరుగుదేశమైన భారత్ సహా ఆరు దేశాలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఆయా దేశాలకు ఉచిత టూరిస్టు వీసాలు ఇవ్వాలని తాజాగా సమావేశమైన శ్రీలంక కేబినెట్ నిర్ణయించింది.

free tourist visas to Indians visiting Sri Lanka

అప్పుల ఊబిలో కూరుకుపోయిన ద్వీప దేశం శ్రీలంక తమ పర్యాటక రంగాన్ని పునర్నిర్మించే ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. భారతదేశంతో పాటు ఆరు దేశాల నుండి వచ్చే ప్రయాణికులకు ఉచిత పర్యాటక వీసాలు జారీ చేసే విధానాన్ని శ్రీలంక క్యాబినెట్ ఆమోదించిందని విదేశాంగ మంత్రి అలీ సబ్రీ ఇవాళ ప్రకటించారు. ఇండియా, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌లకు ఈ ఉచిత వీసాలు జారీ చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

free tourist visas to Indians visiting Sri Lanka

ఇలా భారత్ తో పాటు ఆరు దేశాలకు ఉచిత పర్యాటక వీసాల జారీని పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయబోతున్నారు. దీని ప్రకారం వచ్చే ఏడాది మార్చి 31 వరకు మాత్రమే ఇలా ఉచిత వీసాలు ఇస్తారని విదేశాంగమంత్రి సబ్రీ తెలిపారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందన్నారు. వచ్చే ఏడాది మార్చి తర్వాత ఈ నిర్ణయాన్ని తిరిగి సమీక్షించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని శ్రీలంక ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

శ్రీలంక పర్యాటక మంత్రిత్వ శాఖ గతక్యాబినెట్ సమావేశంలోనే ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది. తాజాగా దీన్ని కేబినెట్ ఆమోదించింది. ఈ ఐదు దేశాల నుంచి శ్రీలంకకు వచ్చే పర్యాటకులకు ఉచిత టూరిస్ట్ వీసాలతో పాటు, సమీప భవిష్యత్తులో శ్రీలంకలోని చాలా పర్యాటక ప్రదేశాలకు ఇ-టికెటింగ్ వ్యవస్థను కూడా క్యాబినెట్ ప్రతిపాదించింది. దీంతో శ్రీలంక ప్రభుత్వ నిర్ణయాలు ఆ దేశంలో టూరిజం అభివృద్ధిని పరుగులు తీయించబోతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+