ఆర్దిక శాస్త్రంలో ప్రెంచ్ ఆర్దికవేత్తకు నోబెల్ బహుమతి
న్యూఢిల్లీ: ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఈసారి ఫ్రాన్స్ను వరించింది. ఫ్రెంచ్ ఆర్దికవేత్త జీన్ టిరోల్కు ఈ ఏడాది నోబెల్ బహుమతి వరించినట్లు 'రాయల్ అకాడమీ ఆఫ్ స్వీడిష్' నోబెల్ ప్రకటించింది. మార్కెట్ సామర్ద్యం, నియంత్రణపై పరిశోధనలకు గాను ఆయనకు ఈ బహుమతి దక్కింది. ఫ్రాన్స్లో జీన్ టిరోల్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
BREAKING NEWS: #nobelprize2014 in Economic Sciences to French Jean Tirole @UT1Capitole pic.twitter.com/nIPAU05eTo
— The Nobel Prize (@NobelPrize) October 13, 2014
 <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>టులూస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లోని జీన్ జాక్వస్ లాఫంట్ ఫౌండేషన్కు ఛైర్మన్గా జీన్ టిరోల్ ఉన్నారు. టులూస్లోని ఇండస్ట్రీయల్ ఎకనమిక్స్ ఇనిట్యిట్యూట్కి సైంటిఫిక్ డైరక్టర్గా విధులను నిర్వహిస్తున్నారు. 1981లో ఎమ్ఐటీ నుంచి పీహెచ్డీ డిగ్రీని పొందిన జీన్ టిరోల్ 1984 వరకు ఎకోల్ నేషనల్ డిపాయింట్స్ ఛాసస్లో రీసెర్చర్గా పని చేశారు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయంలోని ఎకనమిక్స్ విభాగంలో 1984 నుంచి 1991 వరకు ప్రొఫెసర్ పని చేశారు.
ఈ ఏడాది నోబెల్ సాహిత్య బహుమతి కూడా ఫ్రెంచ్ రచయిత పాట్రిక్ మోదియానోకి దక్కింది. సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన 11వ ఫ్రెంచ్ రచయిత ఈయన. పాట్రిక్ మోదియానోకి స్వీడిష్ నోబెల్ అకాడమీ నోబెల్ బహుమతి కింద 1.1 మిలియన్ డాలర్ల నగదు అందజేయనుంది. పాట్రిక్ మోదియానో ఎన్నో చిన్న పిల్లల పుస్తకాలు, సినిమా స్క్రిప్టులు, నవలలు రాశారు.
మోదియానోకి ప్రకటించిన ఈ నోబెల్ బహుమతిని స్వీడిష్ అకాడెమీలో 18 మంది సాహిత్య నిష్ణాతులు కలిసి నిర్ణయించారు. ఎనిమిది మిలియన్ల క్రోనోర్లు (6.7 కోట్ల రూపాయలు) నగదు, స్టాక్ హోం, స్వీడన్లో 10 డిసెంబరున (ఈ బహుమతి నెలకొల్పిన ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్థంతి రోజు) బహుమతి గ్రహీతకు అందజేస్తారు.
దానితోబాటు బంగారు పతకం, యోగ్యతాపత్రం కూడా వారికి లభిస్తుంది. తాను కుటుంబంతో బాటు వెళ్ళి బహుమతి స్వీకరిస్తానని, అది తన ఇద్దరు కుమార్తెలు మనుమడికి అంకితం చేస్తానని మోదియానో ప్రకటించారు.
Click it and Unblock the Notifications