భారతీయులకు అమెరికా శుభవార్త-కోవాగ్జిన్ వేసుకున్న వారికి నవంబర్ 8 నుంచి అనుమతి

భారత్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్ధ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వాడకానికి ప్రపంచ ఆరోగ్య సంస్ధ అనుమతి లభించిన నేపథ్యంలో మరో శుభవార్త కూడా అందింది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఆమోదం నేపథ్యంలో అమెరికా కూడా కోవాగ్జిన్ వేసుకున్న ప్రయాణికులకు తమ దేశంలోకి అనుమతించాలని నిర్ణయించింది.

హైదరాబాదీ సంస్ధ భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఆమోదం లభించిన నేపథ్యంలో ఈ నెల 8 నుంచి ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిని తమ దేశంలోకి అనుమతిస్తున్నట్లు బైడెన్ సర్కార్ ప్రకటించింది. ఈ నిర్ణయంతో భారతీయులకు అత్యధికంగా లబ్ది చేకూరబోతోంది. ఎందుకంటే కోవాగ్జిన్ ను ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ భారతీయులే అత్యధికంగా తీసుకున్నారు. ఆ తర్వాత స్ధానాల్లో మిగతా దేశాలున్నాయి. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఆమోదం నేపథ్యంలో మిగతా దేశాలు కూడా దీన్ని ఆమోదించబోతున్మాయి.

good news to indians, US to allow covaxin vaccinated travellers from november 8

ఇప్పటివరకూ కోవాగ్జిన్ తీసుకున్న భారతీయులకు కూడా మిగతా వ్యాక్సిన్లు తీసుకున్న వారిలాగే అమెరికా వెళ్లాలంటే అక్కడి క్వారంటైన్ నిబంధనలతో పాటు ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ ను తప్పనిసరి చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్ధ నిర్ణయంతో బైడెన్ ప్రభుత్వం కూడా కోవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్న వారిని నేరుగా తమ దేశంలోకి అనుమతించబోతోంది. అసలే కరోనా కారణాలతో అమెరికా వదిలి భారత్ వచ్చి ఇబ్బందులు పడుతున్న నిపుణులు, ఐటీ ఉద్యోగులకు బైడెన్ సర్కార్ నిర్ణయం భారీ ఊరట కాబోతోంది.

ఇప్పటివరకూ యూఎస్ లో కోవిషీల్డ్, ఫైజర్, మోడర్నా, జాన్సస్ అండ్ జాన్సన్, ఆస్ట్రాజెనెకా, సినోఫార్మ్, సినోవాక్ వ్యాక్సిన్లు తీసుకన్న వారినే నేరుగా అనుమతిస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో భారత్ బయోటెక్ కు చెందిన కోవాగ్జిన్ కూడా చోటు సంపాదించుకుంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో మిగతా దేశాలు కూడా అదే బాటలో పయనించవచ్చని తెలుస్తోంది. దీంతో భారతీయులకు ఇకపై కోవిషీల్డ్ , కోవాగ్జిన్ లలో ఏ ఒక్కవ్యాక్సిన్ తీసుకున్నా తమ దేశాల్లోకి అనుమతించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+