వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గూగుల్ చేసిన పొరపాటు: ఆ ఇల్లు.. అతని పరిస్థితి ఎలా అయిందంటే!

ఒకరేమో పిజ్జాల కోసం వస్తే.. మరొకరు ఉద్యోగం కావాలని, ఇంకొకరు బిల్లులు చెల్లించాలని, ఇలా రకరకాలుగా ఆ ఇంటి యజమానిని చాలామంది సంప్రదించారు.

|
Google Oneindia TeluguNews

డార్విన్‌: ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక.. ప్రపంచం స్మార్ట్ ఫోన్ రూపంలో అరచేతిలో ఒదిగిపోయింది. ఎలాంటి పనైనా ఇంట్లోనే కదలకుండా కూర్చుని కానిచ్చేసే పరిస్థితి వచ్చింది. గతంలో లాగా.. పలానా ప్రాంతానికి వెళ్లాలంటే.. 10మందిని అడిగే అవసరం లేకుండా.. కేవలం గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసుకుని దాని ఆధారంగా పనులు చక్కబెట్టుకుంటున్నవాళ్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది.

అయితే అందిపుచ్చుకున్న సాంకేతికలో అప్పుడప్పుడూ లోపాలు తలెత్తడం కూడా కామనే. తాజాగా ఇలాంటి సాంకేతిక లోపం ఓ వ్యక్తి తల పట్టుకునేలా చేసింది. గూగుల్ మ్యాప్ లో తన ఇంటిని పిజ్జా రెస్టారెంట్ గా పేర్కొనడంతో.. ప్రతీరోజు చాలామంది కస్టమర్లు అతని ఇంటికి వచ్చి ఆరా తీయడం మొదలైంది.

ఒకరేమో పిజ్జాల కోసం వస్తే.. మరొకరు ఉద్యోగం కావాలని, ఇంకొకరు బిల్లులు చెల్లించాలని, ఇలా రకరకాలుగా ఆ ఇంటి యజమానిని చాలామంది సంప్రదించారు. దీంతో తలపట్టుకున్న ఆ యజమాని.. అసలెందుకిలా జరగుతుందని ఆరా తీశాడు. చివరకు తేలిందేంటంటే.. గూగుల్ మ్యాప్ లో తన ఇంటిని పిజ్జా రెస్టారెంట్ గా పొందుపరచడంతో.. కస్టమర్లంతా ఇంటికే క్యూ కట్టడం మొదలైంది.

తప్పును గుర్తించిన వెంటనే గూగుల్ సంస్థ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా.. వారు తప్పును సరిదిద్దుకున్నారు. జరిగిన అసౌకర్యానికి అతనికి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.

English summary
Everyone loves pizza, but no one loves strangers coming to one's home and demanding it.So spare a thought for Michael McElwee from Darwin, Australia, whose house keeps being visited by randoms looking for pizza. It's all thanks to an error on Google Maps.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X