ప్రేమించిన అమ్మాయితో పెళ్లి.. అంతలో సందేశం: వరుడి ఉద్వేగం
మెల్‌బోర్న్: టైరోన్ అర్మిటేజ్, కెల్లీ అర్మిటేజ్‌లు పదకొండేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం వీరి పెళ్లికి నిశ్చయమైంది. అతను పెళ్లి పనులలో ఉన్న సమయంలో సోదరి నుంచి ఓ సందేశం వచ్చింది.
ప్రియురాలితో పెళ్లితో ఎంతో సంతోషంగా ఉన్న అతను తన సోదరి చెప్పిన సందేశంతో కుప్పకూలాడు. తన తండ్రికి క్యాన్సర్ అని, ఎక్కువ రోజులు బతకడని తెలిసింది.

చివరి సమయంలో తండ్రిని ఆనందంగా ఉంచేందుకు పెళ్లి పనులను వేగం చేశాడు. వివాహం రోజున కెల్లీ పెళ్లి కూతురు దుస్తుల్లో ఎదురుపడటంతో ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యాడు.
'నా ప్రాణం ఉన్నంత వరకు నీతో జీవించాలనుకున్నాను. అది నెరవేరుతోంది. నేనిది నమ్మలేకపోతున్నా' అని టైరోన్.. కెల్లీకి చెప్పాడు. పెళ్లి వేడుకలో తండ్రి కొడుకులు ఆత్మీయంగా కౌగిలించుకుని ఏడవటం పలువురి హృదయాలను కదిలించింది.


Click it and Unblock the Notifications