నిందితులను వదిలిపెట్టొద్దు: కథువా ఘటనపై ఐక్యరాజ్యసమితి దిగ్భ్రాంతి

Subscribe to Oneindia Telugu

న్యూయార్క్: కథువా అత్యాచార ఘటనపై ఐక్యరాజ్యసమితి తీవ్రంగా స్పందించింది. 8ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు.

'మీడియాలో వచ్చిన కథనాలు నన్ను కదిలించాయి. ఓ పసి ప్రాణాన్ని అతి భయంకర రీతిలో చిత్రవధలకు గురి చేసి నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అలాంటి మానవ మృగాలను క్షమించకూడదు. వారిని తక్షణమే ఉరి తీసి ఆ చిన్నారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భారత ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా' అని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్స్ వ్యాఖ్యానించారు.

 Guilty must be held accountable: UN chief on Kathua rape

మరోసారి ఇలాంటి ఘటనలు మరెక్కడా జరగకూడదని కోరుకుంటున్నట్లు తెలిపారు. దీనిని ఆయన ప్రతినిధి స్టీఫెన్‌ దుజ్జారిక్‌ శుక్రవారం మీడియాకు విడుదల చేశారు.
జమ్మూకాశ్మీర్‌లోని కథువా జిల్లాలో సంచార తెగకు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి జనవరి 10న అదృశ్యమైంది.

కాగా, వారం తర్వాత ఆమె మృత దేహం ఛిద్రమై స్థితిలో లభ్యమైంది. పోస్ట్‌ మార్టం నివేదికలో ఆమెను అతిక్రూరంగా అత్యాచారం చేసి, చంపినట్లు నిర్ధారణ కావటంతో కాశ్మీర్‌ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. బాధితురాలికి న్యాయం చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఈ కేసులో 8మంది నిందితులపై పోలీసులు ఛార్జీ షీటు నమోదు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
United Nations secretary general Antonio Guterres has termed the gangrape and murder of an eight-year-old girl in Jammu and Kashmir's Kathua a "horrific" incident and asked Indian authorities to ensure that the guilty are brought to justice.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X