ఒక్క వెంట్రుకతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ .. ఆమె మామూలు మహిళ కాదు గురూ!!

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్.. ఇందులో స్థానం సంపాదించాలంటే ఎవరికి సాధ్యం కాని గొప్ప పని చేసి ఉండాలి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించడం కోసం కొంతమంది అహర్నిశలు కృషి చేస్తారు. అయితే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం తనకు ఒక్క వెంట్రుకతో సమానమని చెబుతోంది ట్రేసీ మాకి అనే ఒక యువతి.

ఒకే ఒక వెంట్రుకతో ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది. అసలు ఇంతకీ ఆమెకు గిన్నిస్ బుక్ లో స్థానం దక్కించిన ఆ వెంట్రుక కథ ఏమిటంటే.. సహజంగా ఎవరికైనా తల పైన ఉన్న జుట్టు పొడవుగా పెరుగుతుంది. కానీ ఒక మహిళ ప్రపంచంలోనే ఎవరికీ పెరగనంత పొడవైన చేతి వెంట్రుకను పెంచి చూపించింది.

Guinness book of world record with one hair by a woman!!

అయితే ట్రేసీ మాకీ ప్రపంచంలోనే అత్యంత పొడవైన చేతి వెంట్రుకను కలిగి ఉండటంతో ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది. లాంగెస్ట్ ఆర్మ్ హెయిర్ అని వరల్డ్ రికార్డ్స్ ఆమెకు ఒక బిరుదును కూడా అందించింది. ప్రపంచంలోనే ఎవరికి ఇంత పొడవు చేతి వెంట్రుకలు పెరగలేదని గుర్తించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఆమెకు స్థానం కల్పించింది.

18. 40 సెంటీమీటర్లు, 7.2 4 అంగుళాలు పొడవు ఉన్న ఆమె చేతి వెంట్రుకకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం కల్పించింది. స్కూల్లో చదువుకుంటున్న రోజు నుంచి అత్యంత పొడవైన చేతి వెంట్రుక కలిగిన ట్రేసీ మాకీ దానిని జాగ్రత్తగా పెంచాలని భావించింది. తద్వారా గిన్నిస్ బుక్ రికార్డును సృష్టించాలని ప్రయత్నం చేసింది.

అయితే ఆమె ఎంతో జాగ్రత్తగా పెంచిన చేతి వెంట్రుక రాలి పోవడంతో మళ్లీ మళ్లీ ఆ ప్రయత్నాలకు శ్రీకారం చుట్టిన ట్రేసీ మాకి చేతి వెంట్రుకను జాగ్రత్తగా పెంచడం కోసం వైద్యుని వద్దకు వెళ్లి సలహా కూడా తీసుకుంది. అత్యంత జాగ్రత్తగా ఆ చేతి వెంట్రుకను పెంచి గిన్నిస్ బుక్ లో స్థానం దక్కించుకుంది. ఒకే ఒక వెంట్రుకతో గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న సదరు మహిళ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+