వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లగ్జరీ హోటల్‌పై కాల్పులు: 8 మంది మృతి, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల పనే?

|
Google Oneindia TeluguNews

ట్రిపోలి: లిబియా రాజధాని నగరం ట్రిపులోని విలాసంతవమైన కొరింతియా హోటల్ వద్ద కొందరు దుండగులు మంగళవారం దాడి చేశారు. దుండగుల దాడిలో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి చెందారని ఓ భద్రతా అధికారి తెలిపారు. హోటల్లోని కొందర్ని దుండగులు బందీలుగా తీసుకున్నట్లు చెప్పారు. ఐదుగురు విదేశీయులు కూడా ఆ దాడిలో మరణించినట్లు సమాచారం. కారు బాంబును ఉగ్రవాదులు పేల్చినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన తర్వాత కారు బాంబు పేలినట్లు చెబుతున్నారు.

ఆయుధాలు పట్టుకుని ముఖానికి మాస్కులు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి వచ్చిన ఐదుగురు దుండగులు, వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపినట్లు ఆయన తెలిపారు. హోటల్ ముందు కాల్పులు జరుగుతుండటంతో హోటల్లోని కొందరు విదేశీ పర్యాటకులు హోటల్ వెనకవైపు నుంచి పారిపోయినట్లు తెలిపారు.

 Gunmen at Libyan Luxury Hotel Take Hostages; 3 Guards Dead

కాగా, హోటల్ ముందు దుండగులు ఓ కారు బాంబును పేల్చినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకుని దుండగులపై కాల్పులు జరిపాయని తెలిపారు. దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందారని చెప్పారు. దీంతో భారీ చేరుకున్న భద్రతా దళాలు దుండగుల కోసం గాలిస్తున్నాయి.

హోటల్లో ఇటలీ, బ్రిటీష్, టర్కీష్ దేశాలకు చెందిన అతిథులు ఉన్నారని, అయితే హోటల్‌లో దాడి సమయంలో ఎక్కువ మంది లేరని చెప్పారు. హోటల్ పక్కనే నివాసం ఉండే ప్రధాని ఒమర్ అల్ హస్సీ దాడి జరిగిన సమయంలో అక్కడ లేరని తెలిపారు. కాగా, 2013లో కొందరు దుండగులు ఈ హోటల్ వద్దే మాజీ ప్రధానిని అపహరించడం గమనార్హం.

దాడి తామే చేశామన్న ఐఎస్ఐఎస్

కాగా, హోటల్‌పై దాడి చేసింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే దీనిని అధికారులు ధృవీకరించలేదు.

English summary
Gunmen stormed a luxury Libyan hotel popular with foreigners Tuesday, killing at least three guards and taking hostages, a security official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X