H-1B Visa: వీరికి నో వీసా ఫీజు.. జాక్ పాట్ కొట్టినట్లే.. !

H-1B వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అమెరికాలో H-1B వీసా దరఖాస్తు ఫీజును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై H-1B వీసా అప్లికేషన్ ఫీజు లక్ష డాలర్లు (దాదాపు రూ.88 లక్షలు) వసూలు చేయనున్నట్లు ప్రకటన చేశారు. ఇదివరకు ఈ వీసా ఫీజు కేవలం రూ.1 లక్ష నుంచి రూ.6 లక్షల మధ్య ఉండేది.

అయితే తాజాగా H-1B లాటరీ విధాంలోనూ గణనీయంగా మార్పులను చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ కీలక ప్రతిపాదనతో వచ్చినట్లు స్పష్టం అవుతోంది. అధిక నైపుణ్యం, ఉత్తమ వేతనాలు పొందే నిపుణుల ఎంపిక కోసం ఈ ప్రతిపాదనలు తీసుకొస్తున్నట్లు సమాచారం. వీరికి మేలు చేసేలా ట్రంప్ సర్కార్ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.

H-1B Lottery Ditched Trump Pushes Wage-Based Picks for Elite Talent Only

తాజా మార్పుల ప్రకారం.. అధిక నైపుణ్యం ఉంటే విదేశీయులను లక్ష డాలర్ల ఫీజు లేకుండానే అమెరికాలోకి అనుమతించనున్నారు. అలాగే అధిక జీతం పొందుతున్న వారిని కూడా వేతన వర్గీకరణ ఆధారంగా దరఖాస్తులను విభజించనున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త నిబంధనలను వచ్చే ఏడాది నుంచి అమలు చేసేందుకు ట్రంప్ సర్కార్ యత్నిస్తోంది. ఈ రూల్స్ అమల్లోకి వస్తే హెచ్‌-1బీ ఉద్యోగులకు చెల్లించే మొత్తం వేతనాలు 2026 ఆర్థిక సంవత్సరంలో 502 మిలియన్‌ డాలర్లకు పెరుగుతాయని అంచనా వేస్తోంది.

మరోవైపు H-1B వీసా ఫీజు విషయంలో ఇటీవల అమెరికా మరో కీలక ప్రకటన చేసింది. కొత్త H-1B వీసా దరఖాస్తుదారులకు మాత్రమే వార్షిక రుసుము లక్ష డాలర్లు ఉంటుందని ట్రంప్ సర్కార్​ స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న వీసా హోల్డర్లకు లేదా రెన్యూవల్ కు ఈ ఫీజు వర్తించదని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+