H1B వీసాలపై మరో షాక్..! భారత్ లో రిమోట్ వర్కర్లకు తాజా అలర్ట్..!

అమెరికాలో ట్రంప్ సర్కార్ వలసలపై అనుసరిస్తున్న కఠిన విధానాలు ఇప్పుడు హెచ్1బీ వీసాదారులకూ ఇబ్బందికరంగా మారిపోయాయి. గతంలో అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపిన ట్రంప్.. ఆ తర్వాత క్రమంలో అన్ని అనుమతులతో అమెరికాలో వచ్చి ఉంటున్న వారినీ టార్గెట్ చేయడం ప్రారంభించారు. అయితే ఇందులో తలెత్తుతున్న న్యాయపరమైన ఇబ్బందులతో తాజాగా పరోక్షంగా తన విధానాలను అమలు చేసేస్తున్నారు.

ఇందులో భాగంగా హెచ్1బీ వీసాలు ఎక్కువగా కలిగిన భారతీయులకు వాటి రెన్యువల్ కోసం స్వదేశానికి వెళ్లగానే షాకిచ్చారు. ఇప్పుడు జరగాల్సిన హెచ్1బీ వీసా రెన్యువల్ ఇంటర్వ్యూల అపాయింట్ మెంట్లను వచ్చే ఏడాదికి వాయిదా వేయించేశారు. సోషల్ మీడియో వెట్టింగ్ (తనిఖీలు) సాకు చూపి ఇంటర్వ్యూలను వాయిదా వేయించడంతో హెచ్1బీ వీసాల కోసం భారత్ వచ్చిన వారు ఇక్కడే చిక్కుకుపోయారు. వీరంతా ఇప్పుడు రిమోట్ వర్క్ (వర్క్ ఫ్రమ్ హోం) చేసుకుంటున్నారు.

H-1B Visa Chaos Stuck in India Remote Work Risks US Re-Entry Attorney Warns

అయితే ఇలా రిమోట్ వర్క్ చేసుకుంటున్నవారికీ సమస్యలు తప్పడం లేదు. ఇలా మీరు రిమోట్ వర్క్ చేసుకుంటూ ఉండిపోతే, లేకపోతే ఎక్కువ నెలలు భారత్ లోనే ఉండిపోతే తిరిగి అమెరికాకు రావడం, తిరిగి ఉద్యోగాల్లో చేరడం కష్టంగా మారుతుందని అమెరికా ఇమ్మిగ్రేషన్ అటార్నీ డేవిడ్ శాంటియాగో తాజాగా హెచ్చరించారు. భారత్ లో నెలల తరబడి ఇలా రిమోట్ వర్క్ చేయడం హెచ్1బీ నిబంధనలకు విరుద్దమని ఆయన చెప్తున్నారు.

ఇలాంటి పరిస్ధితుల్లో వీసా అపాయింట్ మెంట్ షెడ్యూల్ మార్పు మీ పరిధిలో లేదని, రిమోట్ వర్క్ ఇచ్చిన కంపెనీల నుంచి రాతపూర్వకంగా అఫిడవిట్లు తీసుకోవడమే దీనికి పరిష్కారమని న్యాయనిపుణులు చెప్తున్నారు. అప్పుడు అమెరికాకు తిరిగి ప్రవేశ సమయంలో సరిహద్దు అధికారులకు దీన్ని సమర్పించాల్సి ఉంటుందన్నారు. అలాగే స్టాంపింగ్ జరిగే వరకూ పని చేయకుండా ఆపేయడం, అన్ పెయిడ్ లీవ్ తీసుకోవడం కూడా ప్రత్యామ్నాయాలుగా చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+