H1B Visa: హెచ్1బీ ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ కీలక హెచ్చరికలు..!

అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న వలస వ్యతిరేక విధానాల కారణంగా హెచ్1బీ వీసాల భవితవ్యం ప్రమాదంలో పడుతోంది. ఇప్పటికే హెచ్1బీ వీసాల వార్షిక ఫీజును లక్ష డాలర్లకు పెంచేసిన ట్రంప్.. ఆ తర్వాత వచ్చిన వ్యతిరేకతతో కొత్త ఉద్యోగులకు మాత్రమే వర్తింపజేశారు. అదే సమయంలో హెచ్1బీ వీసాల రెన్యువల్ కోసం భారత్ తో పాటు స్వదేశాలకు వెళ్లిన ఉద్యోగులకు వాటి ఇంటర్వ్యూలు ఆలస్యం చేయడం ద్వారా ట్రంప్ కక్షసాధింపులకు దిగుతున్నారు.

ఈ నేపథ్యంలో హెచ్1బీ వీసాలు కలిగిన తమ దేశ, విదేశీ ఉద్యోగులకు అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక సూచనలు చేస్తోంది. హెచ్1బీ వీసా కలిగిన తమ ఉద్యోగులు అమెరికాను వదిలి వెళ్లొద్దని తేల్చిచెప్పేసింది. ప్రత్యేకించి రీ-ఎంట్రీకి వారి స్వదేశం నుండి వీసా స్టాంపింగ్ అవసరం కాబట్టి అక్కడికి వెళ్లొద్దని మెయిల్స్ పంపుతోంది. తద్వారా మీరు స్వదేశాలకు వెళ్లి అక్కడే చిక్కుకుంటే తమకు ఎలాంటి సంబంధం లేదని తెల్చేస్తోంది.

H-1B Visa Chaos What Microsoft is Telling Employees Stuck Abroad Due to Stamping Delays

హెచ్1బీ వీసా అపాయింట్‌మెంట్‌ల కోసం విదేశాలకు వెళ్లిన కొంతమంది మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు హెచ్చరిక లేకుండా రీషెడ్యూలింగ్ నోటీసులు వచ్చాయని, మరికొందరికి ఇవి తమ దేశాలకు వెళ్లకముందే అందాయని తెలిపింది. దీంతో ప్రస్తుతం అమెరికా బయట ఉన్న వలసేతర ఉద్యోగుల్ని మైక్రోసాఫ్ట్ సంప్రదిస్తోంది. వీసా అపాయింట్‌మెంట్‌లను రీషెడ్యూల్ చేసినప్పటికీ, వారి ప్రస్తుత వీసా స్టాంపులు కొంత కాలం పాటు చెల్లుబాటులో ఉన్న హెచ్1బీ ఉద్యోగుల కోసం, సరైన పని-అధీకృత కేటగిరీలో వారి ప్రస్తుత వీసాలు గడువు ముగిసేలోపు తిరిగి రావాలని సూచిస్తోంది. ఈ పరిస్థితి వీసా అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్ చేసిన వ్యక్తులకు వర్తిస్తుంది. ఎందుకంటే వారి వీసాలు త్వరలో ముగుస్తాయి.

H-1B Visa Chaos What Microsoft is Telling Employees Stuck Abroad Due to Stamping Delays

మరోవైపు అమెరికాలో ఇప్పటికీ ఉన్న మరికొంతమంది తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవడాన్ని పరిశీలించమని కంపెనీ సూచిస్తోంది. ఇది త్వరలో ప్రయాణాలు ప్లాన్ చేసుకున్న వారికి వర్తిస్తుంది. వీసాదారులకు కొత్త వీసా స్టాంప్ జారీ చేసే వరకు తిరిగి రాలేరని, అపాయింట్‌మెంట్‌ను ముందుకు జరపడం చాలా అరుదని తెలిపింది. అలాంటి సమయంలో పని చేసే విషయంలో మీకు పరిమితులున్నాయని గుర్తుచేసింది. అలాగే అమెరికాలో ఇంకా ప్రయాణ ప్రణాళికలతో ఉన్న రెండవ కేటగిరీ వీసా హోల్డర్లకు, రీ-ఎంట్రీ కోసం కొత్త వీసా అవసరం అవుతుంది కానీ వారి హెచ్1బీ వీసా అపాయింట్‌మెంట్ రీషెడ్యూల్ చేయలేదని, కాబట్టి వారు భవిష్యత్తులో ప్రమాదాలను ఎదుర్కోవచ్చని మైక్రోసాఫ్ట్ తెలిపింది. హెచ్1తో పాటు హెచ్4, ఫ్, జే, ఎం వీసాలు కలిగిన వారికీ భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+