బాంబు పేల్చిన మైక్రోసాఫ్ట్: తట్టుకోలేని దెబ్బ- విలవిల
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చారు. H-1B వీసాలపై ఏటా 1,00,000 డాలర్ల ఫీజును విధించే కొత్త విధానాన్ని ప్రకటించారు. ఇది- భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే- హెచ్ 1బీ విసాలను పొందే వారిలో అత్యధిక శాతం భారతీయులే ఉన్నారు. ఈ నిర్ణయం హెచ్-1బీ వీసాల చరిత్రలో ఇప్పటి వరకు చోటు చేసుకున్న అతిపెద్ద సవరణల్లో ఒకటి.
ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ రంగంలోకి దిగింది. తమ విదేశీ ఉద్యోగులందరినీ కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ ఆదివారం నాటికి అమెరికాకు తిరిగి రావాలని ఆదేశించింది. భారత్ సహా అమెరికా బయటి దేశాల్లో పని చేసే టాప్ టు బాటమ్ ఉద్యోగలందరికీ ఈ మేరకు ఇంటర్నల్ ఇమెయిల్స్ పంపించింది. హెచ్1బీ వీసాలపై ప్రకటన వెలువడిన రెండు గంటల్లోనే మైక్రోసాఫ్ట్ ఈ ఇమెయిల్స్ పంపించింది. ఈ నెల 21 అంటే ఆదివారం నాటికి హెచ్-1బీ, హెచ్-4 వీసా ఉద్యోగులందరూ కూడా అమెరికాకు తిరిగి రావాలని మైక్రోసాఫ్ట్ సూచించినట్లు రాయిటర్స్ వెల్లడించింది.

ప్రస్తుతం అమెరికాలో ఉన్న తమ హెచ్-1బీ వీసా ఉద్యోగులు సమీప భవిష్యత్తులో కూడా ఇక్కడే ఉండి పనిచేయాలని కూడా సూచించింది. అమెరికన్లు ఎవరూ కూడా విదేశాల్లోని తమ కార్యాలయాల ద్వారా పని చేసే అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్. అటువంటి కంపెనీ కూడా డొనాల్డ్ ట్రంప్ విధించిన హెచ్ 1బీ విసాల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తోందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మైక్రోసాఫ్ట్‌తో పాటు జేపీ మోర్గాన్ కూడా బయటి దేశాల్లో పని చేస్తోన్నహెచ్-1బీ వీసాదారులను ఆదివారం నాటికి తిరిగి రావాలని సూచించినట్లు రాయిటర్స్ తెలిపింది. విసా వార్షిక ఫీజు పెంపుపై టెక్ కంపెనీలు ఇప్పటివరకు పెద్దగా స్పందించలేదు. అమెజాన్, ఆపిల్, గూగుల్, మెటా వంటి అతిపెద్ద అమెరికన్ టెక్ కంపెనీలకు విదేశాల్లో కూడా వేలాదిమంది ఉద్యోగులు ఉన్నారు. వారందరూ కూడా వెనక్కి వెళ్లాల్సి రావొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
-
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం! -
హార్ముజ్ స్ట్రెయిట్ పై కన్నేసిన ట్రంప్- నాటోపై రుసరుస -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications